News


బ్యాంకు నిఫ్టీ 1.50శాతం అప్‌

Friday 15th March 2019
Markets_main1552624829.png-24622

 ఈ వారం ప్రారంభంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ-50ని అధిగమించి, కొత్త గరిష్టస్థాయికి చేరిన బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. ఈ వారాంతపు రోజైన శుక్రవారం 29,400 పాయింట్ల స్థాయిని అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.  ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల భారీ ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైన అరగంటకే1.50శాతం(483 పాయింట్లు) లాభపడింది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడటం ఇండెక్స్‌కు ర్యాలీకి కారణం. ఉదయం 10 గంటలకు ఇండెక్స్‌ గత ముగింపు(28,923.10)తో పోలిస్తే 1.5 శాతం లాభపడి 29,374 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా కోటక్‌ మహీంద్రా 4.50శాతం, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ ఇండస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు 1.50శాతం పెరిగాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం లాభపడగా, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు అరశాతం లాభపడ్డాయి. 
ఇక మార్కెట్‌ విషయానికొస్తే...
డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబుడుల ప్రవాహం పెరగడం, అంతర్జాతీయంగా బ్రెగ్జిట్‌ ఆందోళనలు తగ్గుముఖం, ఆసియా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ తదితర సానుకూలాంశాలతో నేడు మార్కెట్‌ భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 37,855, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11376 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీగా లాభపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన అరగంటలోనే నిఫ్టీ 11400 మార్కును, సెన్సెక్స్‌ 38,020 మార్కును అందుకున్నాయి.



You may be interested

50వేల పాయింట్లు పక్కా!

Friday 15th March 2019

సెన్సెక్స్‌పై నిపుణుల అంచనా మార్కెట్లో బుల్‌రన్‌ దీర్ఘకాలం కొనసాగుతుందని, వచ్చే దశాబ్దంలో సెన్సెక్స్‌ తప్పక 50వేల పాయింట్ల మైలురాయిని దాటేస్తుందని పలువురు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2009లో ఆరంభమైన బుల్‌రన్‌ ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకుందని మోర్గాన్‌స్టాన్లీ నివేదిక తెలిపింది. దేశ ఈక్విటీ చరిత్రలో ఇది అత్యంత సుదీర్ఘమైన, నెమ్మదైన బుల్‌పరుగని తెలిపింది. ఈ పరుగులో మార్కెట్‌ పదేళ్లలో సరాసరిన 16 శాతం వార్షిక రాబడినిచ్చింది. ఈ ఏడాది

మొండి బకాయిలు తగ్గుతాయ్‌...!

Friday 15th March 2019

ఇక్రా నివేదిక వెల్లడి  ముంబై: వరుసగా నాలుగేళ్లపాటు నష్టాలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలు సాధిస్తాయని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ, ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 8.1-8.4 శాతానికి దిగివస్తాయని, ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రూ.23,000-37,000 కోట్ల రేంజ్‌లో నికర లాభం సాధిస్తాయని పేర్కొంది. అయితే మొత్తం మీద లాభదాయకత బలహీనంగానే ఉండగలదని

Most from this category