News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Tuesday 11th June 2019
Markets_main1560245854.png-26229

బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో మంళవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 31,172ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ఇండెక్స్‌ 1.15శాతం(365 పాయింట్లు) పెరిగి 31,399.35ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(31,034.00)తో పోలిస్తే 1శాతం లాభంతో 300 పాయింట్ల లాభంతో 31,344.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌ అన్ని మొత్తం 15 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4.50శాతం లాభపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.50శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 2శాతం పెరగ్గా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. వాటితో పాటు యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం లాభపడ్డాయి. 
ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 150 పాయింట్ల పెరిగి 39,933 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభపడి 11,975.90 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

మూడోరోజూ లాభాలే..!

Tuesday 11th June 2019

సానుకూల జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్‌ వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 166  పాయింట్లు పెరిగి 39,950.46 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల పెరిగి 11,965.60 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, మీడియా, అటో, ఫైనాన్స్‌, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 231 పాయింట్లు(0.75శాతం) లాభపడి 31,265.45 వద్ద స్థిరపడింది. మరోవైపు

ఆటోమొబైల్‌ ప్లాంట్లు షట్‌డవున్‌

Tuesday 11th June 2019

తగ్గిన వాహన విక్రయాలు  తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయనున్నా తయారి సంస్థలు దేశియ మార్కెట్లలో డిమాండ్‌ లేకపోవడమే కారణం  సాక్షి: వాహన తయారి సంస్థలు కొన్ని రోజుల పాటు తమ ఉత్పత్తి ప్లాంట్‌లను మూసివేయడానికి సిద్ధమవుతున్నాయి. దేశియ మార్కెట్లలో అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాయి. రూ.35,000 కోట్ల విలువ గల 5 లక్షలకు పైగా ప్రయాణ వాహనాలు జూన్‌ మొదటి వారానికి  అమ్మకాలు లేక డీలర్స్‌ వద్దనే ఉన్నాయన్నారు.  రూ. 17,500 కోట్ల

Most from this category