STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 500 పాయింట్లు జంప్‌

Tuesday 5th March 2019
Markets_main1551779611.png-24440

ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 537 పాయింట్లు(2శాతం) లాభపడింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,068 వద్ద ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు ఇంట్రాడే బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల తెరలేపడంతో ఇండెక్స్ పరుగులు తీసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అత్యధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడటం ఇండెక్స్‌​ర్యాలీకి కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇంట్రాడేలో 537 పాయింట్లు(2శాతం) లాభపడి 27,580.75 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు(27043)తో 1.85శాతం (500.70పాయింట్లు) లాభంతో 27,544.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

భారీ లాభాలతో ముగింపు...11,000 సమీపం‍లో నిఫ్టీ

Tuesday 5th March 2019

డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో పాటు మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 379 పాయింట్లు లాభపడి 36,442 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 10,987 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు కావడంతో పాటు గత రెండు నెలల్లో  ఇంతస్థాయిలో సూచీలు లాభపడటం ఇదే మొదటిసారి. ఒక్క ఐటీ షేర్లలో తప్ప, మిగిలిన అన్ని రంగాలకు

టాటా మోటర్స్‌ జూమ్‌

Tuesday 5th March 2019

టాటామోటర్స్‌ షేర్లు మంగళవారం 10శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.183.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన అనుబంధ కంపెనీ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమెరికా మార్కెట్లో ఫిబ్రవరి వాహన విక్రయ గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. జాగ్వర్‌ విభాగపు అమ్మకాల్లో 59శాతం వృద్ధిని, లాండ్‌ రోవర్‌ విభాగంలో 19శాతం వృద్ధిని సాధించాయి. ట్రేడ్‌వార్‌ కారణంగా గత కొంతకాలంగా అమ్మకాలు నిరాశజనకంగా ఉన్న నేపథ్యంలో ఈ ఫిబ్రవరి

Most from this category