STOCKS

News


ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 7th June 2019
Markets_main1559893798.png-26157

ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు నేపథ్యంలో శుక్రవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,943.15 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో మార్కెట్లో జరిగిన అమ్మకాల్లో భాగంగా ఇండెక్స్‌ 0.75శాతం(230 పాయింట్లు) నష్టపోయి 30,627.05 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదు చేసింది. అయితే, సమయం గడుస్తున్న కొద్ది ఇన్వెస్టర్లు క్రమంగా కొనుగోళ్లుకు మొగ్గుచూపడంతో సూచీలు తిరిగిలాభపడ్డాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌రంగ షేర్లలో కూడా కొనుగోళ్లు సాగాయి. ఫలితంగ ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి(30,627.05) నుంచి 480 పాయింట్ల రివకరి సాధించి 31,100.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. అలాగే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అరశాతం లాభపడింది. మరోవైపు యస్‌ బ్యాంక్‌ 1.50శాతం నష్టపోగా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1శాతం, కోటక్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మధ్యా‍హ్నం గం.1:00లకు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 30,983.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇదే సమయానికి సెన్సెక్స్‌ 30 పాయింట్ల నష్టంతో 39496.81 వద్ద, నిప్టీ 5 పాయింట్లు పతనమై 10838 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

క్యాలెండర్‌ స్ప్రెడ్‌ వ్యూహంపై కన్నేయండి!

Friday 7th June 2019

నిఫ్టీ ఆప్షన్స్‌పై నిపుణుల సూచన మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న వేళ ట్రేడర్లు కాలెండర్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వ్యూహంలో దిగువ స్థాయికి చెందిన అదే నెల పుట్‌ను విక్రయించి, తదుపరినెలకు చెందిన అంతకన్నా తక్కువ పుట్‌ను కొనుగోలు చేస్తారు. దీనివల్ల అనుకున్నదాని కన్నా డౌన్‌సైడ్‌ రిస్కులు పెరిగితే హెడ్జ్‌కు పనికివస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యూహం ప్రకారం 11400 పుట్‌ను విక్రయించి, 11200

11830 పాయింట్లకు దిగువన మరింత పతనం!

Friday 7th June 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా చార్టుల్లో నిఫ్టీ బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో కొత్త షార్ట్స్‌ తీసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిఫ్టీలో స్వల్పకాలిక ట్రెండ్‌ రివర్సల్‌ ఆరంభమైందని నిపుణుల భావన. నిఫ్టీ 11830 పాయింట్ల దిగువన బలంగా క్లోజయితే ట్రెండ్‌ రివర్సల్‌ను నిర్ధారించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టీ క్రమంగా 11600 పాయింట్ల వరకు పతనం కావచ్చు. పైన 12103 పాయింట్ల వద్ద అప్‌సైడ్‌నిరోధం కనిపిస్తోంది.

Most from this category