STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Thursday 18th July 2019
Markets_main1563443021.png-27161

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 350 పాయింట్లు నష్టపోయింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ షేర్లలో ప్రధానమైన యస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల క్షీణత​ఇండెక్స్‌ను భారీగా నష్టపరిచింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,705.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండంతో ఒక దశలో 275 పాయింట్లు నష్టపోయి 30459.35 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మిడ్‌ సెషన్‌ అనంతరం కూడా బ్యాంకు షేర్లలో అమ్మకాలు కొనసాగుతుండంతో మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు(30,735.50)తో పోలిస్తే 220 పాయింట్లు నష్టపోయి 30,485.35 వద్ద స్థిరపడింది. యస్‌ బ్యాంక్‌ 13శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 4శాతం, ఐడీఎఫ్‌సీఫస్ట్‌ బ్యాంక్‌ పీఎన్‌బీ బ్యాంక్‌ 3.50శాతం నష్టపోయాయి. అలాగే ఎస్‌బీఐ బ్యాంక్‌ 2.50శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీసీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం మేర పతనమయ్యాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతానికి పైగా ర్యాలీ చేశాయి. 



You may be interested

ఆర్‌ఐఎల్‌ ఫలితాలు.. ఈసారి నిరాశ తప్పదా?

Thursday 18th July 2019

రిఫైనింగ్‌, పెట్రోకెమ్‌ విభాగాల్లో సవాళ్లు దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించనుంది. రిఫైనింగ్‌, పెట్రోకెమ్‌ విభాగాల్లో సవాళ్ల కారణంగా ఈసారి కంపెనీ లాభాల వృద్ధి స్తబ్దుగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే జియో, రిటైల్‌ విభాగాల ప్రదర్శన కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.  క్యు1లో ఆర్‌ఐఎల్‌ ఫలితాలపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... - ఐడీబీఐ క్యాపిటల్‌: లాభంలో 0.6 శాతం వృద్ధి(గతేడాదితో పోలిస్తే) ఉండొచ్చు. రెవెన్యూలో

ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండేషన్లు

Thursday 18th July 2019

వచ్చే ఆరు నెలల కాలంలో మంచి లాభాన్నిచ్చే రెండు షేర్లను ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండ్‌ చేస్తోంది. 1. దివిస్‌ ల్యాబ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1890. స్టాప్‌లాస్‌ రూ. 1515. ఇటీవలే షేరు మంచి కన్సాలిడేషన్‌ పూర్తి చేసుకుంది. దీంతో ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ ఓవర్‌బాట్‌ నుంచి దిగివచ్చింది. దీంతో షేరులో తాజా ఎంట్రీకి ఆస్కారం ఏర్పడింది. వీక్లీ చార్టుల్లో షేరు హయ్యర్‌ టాప్‌, బాటమ్‌ ఏర్పరుస్తోంది. ఇది అప్‌ట్రెండ్‌ కొనసాగింపు సంకేతం.

Most from this category