News


బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం పతనం

Friday 23rd August 2019
Markets_main1566533192.png-27960

నిన్నటి ట్రేడింగ్‌లో రెండువారాల కనిష్టానికి పతనమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం క్షీణించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల భారీ క్షీణిత ఇందుకు కారణమవుతోంది. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ 26,835.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు 3శాతం మేర నష్టపోవడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో 1.64శాతం(544 పాయింట్లు) నష్టపోయి 26590.50 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతమైంది. ఉదయం 9:30ని.లకు కిత్రం ముగింపు(27,034.20)తో పోలిస్తే 1.35శాతం నష్టంతో 26,669.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో యస్‌బ్యాంక్‌, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(1శాతం లాభం) షేర్లు తప్ప మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

ఇదే సమయానికి  ప్రధాన బెంచ్‌మార్స్‌ సూచీలైన నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 10,667.90 వద్ద, సెన్సెక్స్‌ 311 పాయింట్లు పతనమైన 36,161.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

8 నెలల కనిష్ఠానికి రూపీ

Friday 23rd August 2019

దేశియ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో, గత ఏడాది డిసెంబర్‌ తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి శుక్రవారం చేరుకుంది. రూపీ డాలర్‌ మారకంలో 10 పైసలు బలహీనపడి 71.91 ప్రారంభమవ్వగా, కొద్ది నిముషాల్లోనే 72.05 స్థాయిని తాకింది. ఈక్విటీ మార్కెట్‌ భారీగా పడిపోవడంతో పాటు విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 26 పైసలు బలహీనపడి 71.81 వద్ద ముగిసింది. కాగా రూపీ

ఇన్ఫోసిస్‌ రికార్డు

Friday 23rd August 2019

రూపీ డాలర్‌ మారకంలో గత ఏడాది డిసెంబర్‌ తర్వాత అత్యంత కనిష్ఠానికి(71.91 డాలర్‌ మారకంలో) పడిపోవడంతో ఇన్ఫోసిస్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఉదయం 9.26 సమయానికి ఈ షేరు 1.67 శాతం లాభపడి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 809.00 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ షేరు ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకడంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌  రూ. 3,46,395.17 కోట్లకు చేరుకోవడం గమనార్హం. గత సెషన్‌లో రూ. 795.70 వద్ద ముగిసిన ఈ షేరు,

Most from this category