STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Wednesday 2nd January 2019
Markets_main1546421728.png-23370

మార్కెట్‌ పతనంలో భాగంగా బుధవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 1శాతానికి పైగా నష్టపోయింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం ఇండెక్స్‌ను దెబ్బతీసింది. మధ్యాహ్నం గం.2:45ని.కు ఇండెక్స్‌ గత ముగింపు(27,392.40)తో పోలిస్తే అరశాతానికి పైగా నష్టపోయి 27,190.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం నష్టపోయింది. పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2.50శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్ 2శాతం, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం క్షీణించాయి. కోటల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఫెడరల్‌ బ్యాంక్‌ 2శాతం లాభపడగా, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం పెరిగాయి.You may be interested

ముంచుకొస్తున్న ఐదు సంక్షోభాలు

Wednesday 2nd January 2019

ఈ ఏడాది ఎకానమీల్లో తీవ్ర ఇబ్బందులకు అవకాశం చేతిలో వీలయినంత నగదు ఉంచుకోవడం ఉత్తమం నిపుణుల సలహా అంతర్జాతీయంగా ఉద్దీపనల ఉపసంహరణ వేగవంతమవుతున్న వేళ మార్కెట్లలో భయాలు పెరిగిపోతున్నాయి. ఉద్దీపనల ఉపసంహరణ పరిణామాలు మరిన్ని ప్రతికూలాంశాలకు దారి తీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు డౌన్‌సైడ్‌ షాకులు తట్టుకునేందుకు తయారుగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒకదాని కారణంగా ఒకటిలాగా ఐదు అంశాలు మార్కెట్లలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అంతఃసంబంధం కలిగి మొత్తం

సెన్సెక్స్‌ 400 పాయింట్ల డౌన్‌

Wednesday 2nd January 2019

10800 దిగువకు నిఫ్టీ ఇండెక్స్‌ మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటో, మెటల్‌ రంగ షేర్లలో అ‍మ్మకాలు సూచీలను నష్టాల బాట పట్టించాయి. అలాగే ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌తో పాటు యూరప్‌, అమెరికా మార్కెట్లకు చెందిన ఫ్యూచర్ల నెగిటివ్‌ ట్రేడింగ్‌ సైతం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి.  అలాగే మార్కెట్లో అధిక షేర్లు ఎక్కువగా వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతుండంతో పాటు ఇటీవల కొన్ని షేర్లు తమ

Most from this category