STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1.50 శాతం డౌన్‌

Thursday 6th December 2018
Markets_main1544090710.png-22703

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ గురువారం 1.50శాతం నష్టపోయింది. మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు బ్యాంకు నిఫ్టీ పతనానికి కారణమయ్యాయి. మధ్యాహ్నం గం.3:15ని.లకు సూచి గత ముగింపుతో పోలిస్తే 1.25శాతం నష్టంతో 26,207.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం 12 షేర్లలో 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా ఒక్క ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు మాత్రం స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 4.50శాతం నష్టపోయింది. యస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 3శాతం క్షీణించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం పతనమయ్యాయి. అలాగే ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్‌ షేర్లు 1శాతం నష్టపోగా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఫెడరల్‌ బ్యాంకు షేరు మాత్రం 1శాతం స్వల్పలాభాల్లో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

మార్కెట్‌ టార్చ్‌బేరర్‌.. రిలయన్స్‌

Thursday 6th December 2018

స్టాక్‌ మార్కెట్‌ కొత్త ర్యాలీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేతృత్వం వహిస్తుందని సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ (ఈక్విటీ అడ్వైజర్‌) దేవాంగ్‌ మెహతా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. విక్రయాల కోసం ఎగుమతులపై ఆధారపడే ఆటోమొబైల్‌ సంస్థలు లేదా వాహన విడిభాగాల కంపెనీలకు ప్రస్తుతం దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మరోవైపు దేశీయంగా చూస్తే వాహన విక్రయాలు నెమ్మదించాయని గుర్తు చేశారు. రానున్న

రెండంకెల్లో నిఫ్టీ కంపెనీల లాభాల వృద్ధి..!

Thursday 6th December 2018

హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సీఐఓ ప్రశాంత్ జైన్ వ్యాఖ్య ముంబై: కార్పొరేట్ బ్యాంకులు రికవరీ సాధిస్తుండడం, నూతన మొండి బకాయిల తగ్గుదల ఆధారంగా వచ్చే కొన్నేళ్లలోనే నిఫ్టీ ఎర్నింగ్స్‌ షార్ప్‌ రికవరీని సాధించే అవకాశం ఉందని ప్రశాంత్ జైన్ అన్నారు. నాలుగేళ్ల బలహీన లాభదాయకత తరువాత.. నిఫ్టీ ఈపీఎస్‌ వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో ఉండనుందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాదాపు రూ.75,000 కోట్ల ఆస్తుల

Most from this category