STOCKS

News


27000 దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 26th February 2019
Markets_main1551167879.png-24339

నష్టాల మార్కెట్లో భాగంగా బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎక్కువగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ గ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 1.50శాతం నష్టపోయింది. అయితే మార్కెట్‌ రికవరీలో భాగంగా ఇండెక్స్‌ నష్టాలను పరిమితం చేసుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గతముగింపు(26,736.60)తో పోలిస్తే 0.60శాతం (171.05 పాయింట్లు) నష్టపోయి 27000 దిగువున 26,988 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో పీఎన్‌జీ 2.50శాతం, ఐడీఎఫ్‌సీఫస్ట్‌బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం వరకు క్షీణించాయి. అలాగే కోటక్‌ బ్యాంక్‌ 1శాతం నష్టపోగా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ అరశాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.20శాతం పతనమైంది. మరోవైపు ఫెడరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ 1.25శాతం లాభపడింది. ఆర్‌బీఎల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి.  
భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ఉదయం ట్రేడింగ్‌లో క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు 30 పాయింట్ల నష్టంతో 10850 వద్ద, సెన్సెక్స్‌ 140  పాయింట్లను కోల్పోయి 36,072 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంక్‌, ఆర్థిక, మెటల్‌, రియల్టీ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాల్లో స్వల్పంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. 



You may be interested

కరాచీ ఇండెక్స్‌ క్రాష్‌

Tuesday 26th February 2019

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో అటు పాకిస్థాన్‌ దేశపు ఎక్చే‍్సంజ్‌లు కూడా భారీగా నష్టపోతున్నాయి. నేడు కరాచీ స్టాక్‌ ఇండెక్స్‌(కేఈసీ) 465 పాయింట్లు(1.17శాతం) నష్టపోయి 39,142.29 వద్దకు పతనమైంది. పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా భారత వాయుదళం ఎల్‌ఓసీని దాటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం మూడు నిర్దేశిత లక్ష్యాలపై వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు గల లేజర్‌ గైడెడ్‌ బాంబులతో యుద్ధ విమానాలు

త్వరలో రిలయన్స్‌ రిటైల్‌ ఐపీఓ !

Tuesday 26th February 2019

జూన్‌ తర్వాత ఐపీఓకు  6,400 నగరాల్లో 9,900కు పైగా రిటైల్‌ స్టోర్స్‌ ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ త్వరలోనే ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నదని సమాచారం.   ఈ ఏడాది జూన్‌ తర్వాత రిలయన్స్‌ రిటైల్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఐపీఓ ఉండొచ్చని, ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రాగలదని అంచనాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్‌ రిటైల్‌తో పాటు ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన మొబైల్‌ వెంచర్‌,

Most from this category