STOCKS

News


ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్ల క్షీణత: బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం డౌన్‌..!

Thursday 10th January 2019
Markets_main1547103000.png-23504

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం క్షీణించింది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల క్షీణత ఈ ఇండెక్స్‌ను నష్టాల్లోకి నెట్టింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(27,577.35)తో పోలిస్తే 0.50శాతం(150పాయింట్ల) నష్టంతో 27577ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ ఇండెక్స్‌లోని ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఇండస్‌ ఇండ్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. అలాగే ఫెడరల్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం పతనమయ్యాయి. అయితే ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, 1శాతం లాభపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ అరశాతం ర్యాలీ చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.10శాతం స్వల్పంగా పెరిగింది. 



You may be interested

ఈక్విటీలను ‘సిప్‌’ చేస్తున్నారు

Thursday 10th January 2019

దేశీయ హౌస్‌హోల్డ్‌ అసెట్స్‌లో క్రమంగా ఈక్విటీ పెట్టుబడుల వాటా పెరుగుతోంది. రిటైలర్లలో మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆసక్తి కారణంగా గృహ పెట్టుబడుల్లో ఈక్విటీలు క్రమంగా మంచిస్థానం సంపాదించుకుంటున్నాయని ఆర్బీఐ, ఐఆర్‌డీఏ తదితర సంస్థల గణాంకాల ఆధారంగా సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం హౌస్‌హోల్డ్‌ అసెట్స్‌ విలువ 8.5 లక్షల కోట్ల డాలరు. ఇది జీడీపీ కన్నా మూడు రెట్లు అధికం. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 9

ఈ ఏడాది మిడ్‌క్యాప్స్‌దే హవా!

Thursday 10th January 2019

నిపుణుల అంచనా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ బాటమ్‌అవుట్‌ అవుతున్నాయని, ఇకమీదట వీటిలో పునరుజ్జీవం కనిపించవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది లార్జ్‌క్యాప్స్‌ కన్నా మిడ్‌క్యాప్స్‌ మంచి ప్రదర్శన చూపవచ్చని అభిప్రాయపడ్డారు. వాల్యూషన్లు దిగిరావడం, క్రూడాయిల్‌ ధర తగ్గడంతో వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ఎర్నింగ్స్‌లో వృద్ధి కారణంగా చిన్నస్టాకులు కళకళలాడతాయని ఎలెరా క్యాపిటల్‌ నివేదిక తెలిపింది. అయితే ఇన్వెస్టర్లు తొందరపడి హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. ప్రతి పతనంలో

Most from this category