STOCKS

News


భారీ నష్టాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Monday 10th December 2018
Markets_main1544421059.png-22800

మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల సునామిలో భాగంగా బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టపోయితున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం క్షీణించి 26073.30 స్థాయికి పడిపోయింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ గతముగింపు (26594.30)తో పోలిస్తే దాదాపు 361.45 పాయింట్లు నష్టపోయి 26,238.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 12 షేర్లలో 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇండెక్స్‌ అత్యధికంగా యస్‌బ్యాంక్‌ 3శాతం నష్టపోయింది. పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. ఎస్‌బీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు అరశాతం నుంచి ఒకశాతం లాభపడ్డాయి. గతవారంలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,065-26,234 శ్రేణిలో కదలాడి 0.7శాతం స్వల్పనష్టంతో 26,726 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వారంలో 5రాష్టా‍్రల ఎన్నికల ఫలితాలు, ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ అస్థితరలు తదితర కారణాలతో ఈ వారంలో ఇండెక్స్‌ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌కు 26,000-25,900వద్ద బలమైన మద్దతు స్థాయిని వారు సూచిస్తున్నారు.



You may be interested

ఎలక‌్షన్‌ ఫలితాల టెన్షన్‌ : అదానీ గ్రూప్‌ షేర్లు డౌన్‌

Monday 10th December 2018

సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్‌ భావించే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో సోమవారం మార్కెట్లో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రం ప్రభుత్వమైన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడతాయేమోనన్న భయాలతో బీజేపీకి సన్నిహిత గ్రూప్‌గా  పేరొందిన అదానీ గ్రూప్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఈ గ్రూప్‌లోని అదానీ పవర్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌ షేర్లు 7నుంచి

పెట్టుబడికి రేటింగ్‌ చూస్తారా?

Monday 10th December 2018

సినిమా చూసేముందు ఆ సినిమాకు రేటింగ్‌ ఎంతనేది చూస్తారు కొందరు!  కొందరైతే రెస్టారెంట్లకు వెళ్లేటపుడు కూడా దాని రేటింగ్‌, దానిపై ఇతరుల రివ్యూలు చూస్తారు!. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే రేటింగ్‌లు, రివ్యూలు చూసినపుడు... మరి మనం కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటపుడు ఇలాంటివి చూడొద్దా..? అసలు ఆ పెట్టుబడిలో రిస్కు ఎంత? రాబడి ఎంత? దాని గురించి దాన్ని జారీ చేస్తున్నవారు చెప్పే మాటల్లో నిజమెంత? ఇవన్నీ చెప్పేది

Most from this category