STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Wednesday 5th December 2018
Markets_main1543999193.png-22666

కీలక వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం కోసం మార్కెట్‌ వర్గాల నిరీక్షణ నేపథ్యంలో పలు బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ నేటి ట్రేడింగ్‌లో 1శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(26,693.80)తో పోలిస్తే అరశాతం నష్టంతో 26,557.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 12 షేర్లలో 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఆర్‌బీఎల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 3శాతం నష్టపోయింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2శాతం, కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పతనయ్యాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం క్షీణించాయి. అలాగే ఎస్‌బీఐ బ్యాంక్‌, పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.10శాతం స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఆర్‌బీఎల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

స్థిరంగానే పాలసీ రేట్లు..

Wednesday 5th December 2018

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణమైన నిర్ణయాన్నే ప్రకటించింది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.50 శాతంగా నిలకడగానే ఉంది. రెపో పెంపుతో అనుసంధానమైన ఇతర పాలసీ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. రివర్స్‌ రెపో రేటు 6.25 శాతంగా ఉంది. ఇక నగదు

స్వల్పకాలానికి 5 స్మాల్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 5th December 2018

ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, బ్రెగ్జిట్‌పై యూకే పార్లమెంట్‌ ఓటింగ్‌, ఫెడ్‌ సమావేశం, ఒపెక్‌ మీటింగ్‌ వంటి అనేక మార్కెట్‌ ప్రభావిత అంశాలు వరుసగా ఉన్నందున ఫార్మా రంగం షేర్లు ఒడిదుడుకులకు లోనుకావచ్చని మోనార్క్‌ నెట్‌వర్క్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అర్పన్‌ షా అన్నారు. అయితే, సిప్లా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ప్రస్తుతం పెట్టుబడులకు సూచింపదగిన షేర్లుగా ఉన్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

Most from this category