STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Tuesday 4th December 2018
Markets_main1543903754.png-22606

బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో మంగళవారం బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం నష్టపోయింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ 26,809.50ల వద్ద ప్రారంభమైంది. నేడు మార్కెట్లో నెలకొన్న అమ్మకాల్లో భాగంగా బ్యాంకింగ్‌ నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా ఈ రంగ షేర్లలో అధిక వెయిటేజీ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీం‍ద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (26,857.55)తో పోలిస్తే 0.75శాతం నష్టపోయి 26,657.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సయాయానికి ఈ సూచీలో మిగతా షేర్లైన ఎస్‌బీఐ. పీఎన్‌బీ, ఆర్‌బీఎల్‌ షేర్లు అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ఇదే బ్యాంక్‌ నిఫ్టీ సూచీలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ 1శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

హెచ్‌యూఎల్‌కు హార్లిక్స్‌ బూస్ట్‌

Tuesday 4th December 2018

 డీల్‌ విలువ రూ.27,750 కోట్లు హెచ్‌యూఎల్‌లో విలీనం కానున్న జీఎస్‌కే ఇండియా ఒకో జీఎస్‌కే షేరుకు 4 హెచ్‌యూఎల్‌ షేర్లు న్యూఢిల్లీ: దేశ ఎఫ్‌ఎంసీజీ రంగంలో భారీ డీల్‌ సాకారమైంది. పలితం... దేశీయ న్యూట్రిషనల్‌ హెల్త్‌ డ్రింక్స్‌ మార్కెట్లోకి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇటీవలే కాంప్లాన్‌ బ్రాండ్‌ చేతులు మారగా... దశాబ్దాలుగా న్యూట్రిషనల్‌ హెల్త్‌ డ్రింక్స్‌ విభాగంలో దేశంలో టాప్‌ బ్రాండ్లుగా వెలుగుతున్న... గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కు

నెలరోజుల గరిష్టానికి పసిడి

Tuesday 4th December 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధరల మంగళవారం నెలరోజుల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. జీ-20 సదస్సులో జరిగి చర్చల ఫలితంగా అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కలికంగా తెరపడింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డాలర్‌ నుంచి ఈక్విటీ షేర్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ మారకం బలహీనపడుతోంది. మరోవైపు ఫెడ్‌ కీలక వడ్డీరేట్ల సందిగ్ధత భయాలు ఇన్వెస్టర్లను ఇంకా వెంటాడుతుండం కూడా డాలర్‌ అస్థిరతకు

Most from this category