STOCKS

News


నష్టంలో బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 13th February 2019
Markets_main1550050877.png-24178

ముంబై:- ప్రభుత్వం రంగ షేర్ల పతనంతో బుధవారం బ్యాంక్‌ నిఫ్టీ సూచీ 27000 కీలక సాంకేతిక స్థాయిని కోల్పోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్‌ దాదాపు 0.30శాతం(85 పాయింట్లు) వరకు నష్టపోయింది. మధ్యాహ్నం గం.2:30లకు ఇండెక్స్‌ గతముగింపు(27,010.75)    తో పోలిస్తే 0.24(56 పాయింట్లు) నష్టంతో 26,954 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో మొత్తం 12 షేర్లకు గానూ 8షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా 4షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఫెడరల్‌ బ్యాంక్‌ 2.50శాతం నష్టపోయింది. అలాగే ఎస్‌బీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే ఐడీఎఫ్‌సీఫస్ట్‌బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. అలాగే యాక్సి్‌స్‌ బ్యాంక్‌ అరశాతం వరకు క్షీణించింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం లాభపడగా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం పెరిగాయి.



You may be interested

ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌ను కొనొచ్చు!

Wednesday 13th February 2019

యస్‌ సెక్యూరిటీస్‌ సూచన కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చిందనే విషయంతో సంబంధం లేకుండా మార్కెట్‌ల పనితీరును అర్ధం చేసుకోవాలని యస్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ప్రశాంత్‌ ప్రభాకరన్‌ సూచించారు. ప్రభుత్వాల ఏర్పాటు మార్కెట్‌పై చూపే ప్రభావం స్వల్పకాలికమన్నారు. స్టాక్‌ ఫండమెంటల్సే మార్కెట్‌ను ముందుకు నడుపుతాయన్నారు. ప్రస్తుత వాల్యూషన్లను పరిగణనలోకి  తీసుకుంటే లార్జ్‌క్యాప్స్‌ కన్నా మిడ్‌క్యాప్స్‌ను ఎంచుకోవడం ఉత్తమమని సలహా ఇచ్చారు. వాల్యూషన్ల పరంగా పెద్ద స్టాకుల కన్నా చిన్నస్టాకులు చౌకగా ఉన్నాయని చెప్పారు.

స్వల్పంగా పెరిగిన పసిడి

Wednesday 13th February 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. అమెరికా - చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్లకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌  పసిడికి బలానిస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్ల మేర బలపడి 1,317.55 డాలర్లకు చేరుకుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు 0.10శాతం క్షీణించి 96.442 కనిష్టాన్ని తాకింది. వ్యయాల బిల్లుకు కాంగ్రెస్‌

Most from this category