STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం డౌన్‌

Thursday 25th April 2019
Markets_main1556185983.png-25346

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో నెలకొన్న అమ్మకాలతో బ్యాంకు నిఫ్టీ గురువారం ట్రేడింగ్‌లో 1 శాతం(320 పాయింట్లు) నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ 29,927.05ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా బ్యాంకింగ్‌ షేర్లు లాభపడంతో ఇండెక్స్‌ 0.75శాతం(200 పాయింట్లు) జంప్‌చేసి 30057.70ల గరిష్టానికి చేరుకుంది. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్‌లో మొదలైన అమ్మకాలతో ఇండెక్స్‌ ఆర్జించిన లాభాలన్నింటిని కోల్పోయి నష్టాల బాట పట్టింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల పతనం ఇండెక్స్‌ను భారీగా నష్టపరిచింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు(29,860.80)తో పోలిస్తే 1శాతం నష్టపోయి 29,534.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన బ్యాంకు ఆఫ్‌ బరోడా 2.50శాతం నష్టపోయింది. పంజాబ్‌నేషనల్‌ బ్యాంక్‌ 2శాతం, యాక్సిస్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు 1శాతం నష్టపోయాయి. అలాగే ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 1శాతం క్షీణించగా, కోటక్‌ బ్యాంక్‌, ఫెడరల్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. ఐడీఎఫ్‌సీఫస్ట్‌ షేర్లు మాత్రం 1.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

మళ్లీ అమ్మకాలు...సెన్సెక్స్‌ 323 పాయింట్లు డౌన్‌

Thursday 25th April 2019

  11650 దిగువున ముగిసిన నిఫ్టీ క్రితం రోజు కదంతొక్కిన స్టాక్‌ సూచీలు గురువారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్లు నష్టపోయి 38,730.86 వద్ద, నిఫ్టీ 84.35 పాయింట్లు కోల్పోయి 11,642 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడిచమురు ధర ఈ ఏడాదిలో తొలిసారి 75డాలర్ల పైకి చేరడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 37 పైసలు కరిగిపోవడంతో పాటు చివరి గంట అమ్మకాలు వెల్లువెత్తి మార్కెట్‌

అదరగొడుతున్న అల్ట్రాటెక్‌ సిమెంట్‌

Thursday 25th April 2019

మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో పాటు బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ పెంపుతో గురువారం ఆల్ట్రాటెక్‌ షేర్లు అదరగొడుతున్నాయి. క్రితం రోజు కంపెనీ గతేడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.  స్టాండర్డ్‌లోన్‌ ప్రాతిపదికన రూ.1,017 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.446.14 కోట్లే కావడం గమనార్హం. మొత్తం అమ్మకాల ఆదాయం 18శాతం పెరిగి రూ.10,334 కోట్లను ఆర్జించింది. అంతకుముందు

Most from this category