STOCKS

News


30500 పైన బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 16th July 2019
Markets_main1563266445.png-27100

మార్కెట్‌ స్వల్పలాభాల్లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం అరశాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30532.65 వద్ద ప్రారంభమైంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 189 పాయింట్లు పెరిగి 30,500 అధిగమించి  30635.00 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:35ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,445.95)తో పోలిస్తే 61 పాయింట్లు పెరిగి (0.20శాతం) 30,500.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌ అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ షేర్లు 10శాతం పెరిగాయి. పీఎన్‌బీ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ 1శాతం పెరిగింది. యాక్సిస్‌ బ్యాంక్‌ అరశాతం పెరిగింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 4.50శాతం నష్టపోయింది. ఫెడరల్‌ బ్యాంక్‌ 3శాతం క్షీణించింది. ఐడీఎఫ్‌సీఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం పతనమయ్యాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు అరశాతం నుంచి 0.10శాతం క్షీణించాయి. 
ఇదే సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 11,628.95 వద్ద,  సెన్సెక్స్‌ 162 పాయింట్లు లాభపడి 39,058.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

లాభాల్లో రియల్టీ షేర్లు..

Tuesday 16th July 2019

బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ మంగళవారంలో ట్రేడింగ్‌లో 65 పాయింట్లు లాభపడి 11,653.35 వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా  నిప్టీ రియల్టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.94 శాతం లాభపడి 285.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సూచీలో డీఎల్‌ఎఫ్‌ 3.04 శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 2.84 శాతం, పినిక్స్‌ మిల్స్‌ లి. 2.76 శాతం, ప్రెస్టేజ్‌ 2.58 శాతం, శోభా 1.77 శాతం, ఇండియా బుల్స్‌ 0.88

రెండంకెల రాబడికి నార్నొలియా రికమండేషన్లు

Tuesday 16th July 2019

స్వల్పకాలంలో 10-20 శాతం రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ సిఫార్సు చేస్తుంది 1. హిందుస్థాన్‌ ఆయిల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 150. స్టాప్‌లాస్‌ రూ. 109. దిగువన రూ.110ని తాకిన అనంతరం వేగంగా రీబౌండ్‌ చెంది కన్సాలిడేషన్‌లోకి వెళ్లింది. ప్రస్తుత పోల్‌ అండ్‌ ఫ్లాగ్‌ ప్యాట్రన్‌ నుంచి రూ. 130కి పైన బ్రేకవుట్‌ సాధిస్తే మరింత అప్‌మూవ్‌ ఉంటుంది. 2. మనుప్పురం ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ.

Most from this category