STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ రికవరీ

Wednesday 3rd October 2018
Markets_main1538552749.png-20822

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల ట్రేడింగ్‌ నుంచి రికవరీ బాట పట్టింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 25,290.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్ల పతనం కారణంగా ఈ సూచీ 1శాతం నష్టపోయి 25143.00 స్థాయికి పతనమైంది. అనంతంర మార్కెట్‌ రికవరీలో భాగంలో యస్‌బ్యాంక్‌(8శాతం లాభం) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు ర్యాలీతో తిరిగి లాభాల బాట పట్టింది. గత ముగింపు(25367.00)తో పోలిస్తే అరశాతం(100 పాయింట్లు) లాభపడి 25470.05 చేరుకుంది. అంటే ఇంట్రాడే కనిష్టం 25367.00 నుంచి ఇంట్రాడే గరిష్టం 25470.05 వరకు (327 పాయింట్లు) 1.30శాతం లాభపడింది. మధ్యహ్నాం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపుతో 0.10శాతం(25 పాయింట్ల) స్వల్ప లాభంతో 25,302.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి
-     బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌లోని మొత్తం 12 షేర్లకు గానూ 7షేర్లు లాభాల్లో 5 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
-    అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ 7శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది.
-    పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు 3నుంచి 1శాతం లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్‌ బరోడా షేర్లు అరశాతం లాభపడ్డాయి.
-    మరోవైపు, అత్యధికంగా యాక్సి్‌క్‌ బ్యాంక్‌ 3శాతం నష్టం పోయింది.
-    ఫెడరల్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోటల్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 3.50శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.



You may be interested

రూపీ ఇంకా పడొచ్చు.. ఐటీ, ఫార్మాపై కన్నేయండి..

Wednesday 3rd October 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం 73 మార్క్‌ దిగువకు పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే జీవిత కాల కనిష్ట స్థాయి 73.40ని తాకింది. అయితే ఈ పతనం మరింత కొనసాగవచ్చని మర్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. ‘ఆర్‌బీఐ చర్యలు మార్కెట్‌లో లిక్విడిటీ సమస్యను శాంతింపజేస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ రూపాయి పతనాన్ని నియంత్రించకపోవచ్చు. క్రూడ్‌ ధరలు పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ వ్యవస్థలోకి ఎక్కువ లిక్విడిటీని తీసుకువస్తోంది. దీని వల్ల రూపాయిలో

టెల్కోల బాధలు తప్పేలా లేవు..

Wednesday 3rd October 2018

జియో నుంచి ధరల పోటీ కొనసాగుతుండటం వల్ల టెలికం కంపెనీలు రానున్న త్రైమాసికంలోనూ బలహీన ఎర్నింగ్స్‌ను ప్రకటించొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. ‘భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ సహా వైర్‌లెస్‌ సేవలందించే టెల్కోల ఎర్నింగ్స్‌ వచ్చే త్రైమాసికంలోనూ ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పోస్ట్‌పెయిడ్‌ రి-ప్రైసింగ్‌, ప్రిపెయిడ్‌ ఏఆర్‌పీయూ తగ్గుతూ రావడం, జియో ఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ వల్ల కంపెనీల రెవెన్యూ తగ్గొచ్చు. వొడాఫోన్‌-ఐడియా టెనన్సీ ముగింపు వల్ల భారతీ ఇన్‌ఫ్రాటెల్‌పై నెగటివ్‌

Most from this category