STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు

Wednesday 27th March 2019
Markets_main1553661496.png-24815

ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ-50ని అవుట్‌పెర్‌ఫార్మ్‌ చేస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ బుధవారం కొత్త రికార్డును సృష్టించింది. మూడు రోజుల క్రితం నమోదుచేసిన 30,008 పాయింట్ల రికార్డు స్థాయిని తాజాగా అధిగమించిన బ్యాంక్‌ నిఫ్టీ 30,132 పాయింట్ల వద్ద కొత్త గరిష్టస్థాయిని తాకింది. ఉదయం 10 గంటల సమయానికి ఈ సూచి 178 పాయింట్ల లాభంతో 30,060 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సూచీలో భాగమైన ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌ అత్యధికంగా 4 శాతం జంప్‌చేసింది. యస్‌ బ్యాంక్‌ 3.5 శాతం పెరగ్గా, రత్నాకర్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ షేర్లు 1 శాతంపైగా పెరిగాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో రూ.2328 వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్వల్పనష్టంలోకి జారిపోయింది.

మూడు వారాల్లో 3000 పాయింట్లు...

ఈ మార్చి 5న 26,950 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన తరువాత కేవలం మూడు వారాల్లో 3100 పాయింట్ల (11 శాతం) వరకూ పెరిగి 30,000 పాయింట్ల స్థాయిని అధిగమించి జీవితకాల రికార్డుస్థాయికి చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ-50 10,817 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి 700 పాయింట్ల వరకూ (6.5 శాతం) పెరిగింది. ఈ ప్రధాన సూచీ గతేడాది ఆగస్టులో నెలకొల్పిన 11,760 పాయింట్ల రికార్డుస్థాయిని అందుకునేందుకు మరో 2 శాతం దూరంలో వుండగా, అప్పట్లో బ్యాంక్‌ నిఫ్టీ నెలకొల్పిన 29,350 పాయింట్ల రికార్డును ఇప్పటికే అధిగమించడం విశేషం. 



You may be interested

పెరిగిన పసిడి

Wednesday 27th March 2019

గత ట్రేడింగ్‌లో రెండువారాల కనిష్టానికి పతనమైన పసిడి బుధవారం ట్రేడింగ్‌లో తిరిగి లాభాల బాట పట్టింది. నేడు ఆసియాలో  3.50డాలర్లు పెరిగి 1,324.45డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఆర్థిక మాంద్య భయాలతో ఆసియాలో పలు ఈక్విటీ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం, ఇటీవల వెలువడిన బలహీన ఆర్థిక గణాంకాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి. గతరాత్రి అమెరికా మార్కెట్లు లాభాల ముగింపుతో పాటు, బాండ్‌ ఈల్డ్‌ పెరిగిన నేపథ్యంలో

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 27th March 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు  షీలా ఫామ్‌:- ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ ద్వారా ఇద్దరు ప్రమోట‌ర్లు 8.88శాతం వాటాను మార్చి 27-28 తేదీల్లో విక్రయించ‌నున్నారు. ఇందుకు ఫ్లోర్ ధ‌ర రూ. 1, 100లుగా నిర్ణయించారు.  జెట్ ఎయిర్‌వేస్‌:-  ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఇప్పటికి వ‌ర‌కు నిలిపివేసిన 50 విమాన స‌ర్వీసులను మార్చి 31వ తేది నుంచి పునఃప్రారంభించడానికి సిద్ధమైన‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వెల్లడ‌య్యాయి.  వోక్హార్డ్‌:- ఔరంగ‌బాద్ యూనిట్లో ఐర్లాండ్‌, బ్రిట‌న్

Most from this category