STOCKS

News


28,000 పైన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th August 2018
Markets_main1533706167.png-19043

బ్యాంక్‌ నిఫ్టీ బుధవారం మార్నింగ్‌ సెషన్‌లో 28,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. బ్యాంక్‌ నిఫ్టీ తన మంగళవారం నాటి ముగింపు 27,876 పాయింట్లతో పోలిస్తే బుధవారం 55 పాయింట్ల లాభంతో 27,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తర్వాత ఉదయం 10:51 సమయంలో బ్యాంక్‌ నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 28,017 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒకానొక సమయంలో 52 వారాల గరిష్ట స్థాయి 28,024 పాయింట్లను కూడా తాకింది. 
బ్యాంక్‌ నిఫ్టీలోని దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికిపైగా లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పీఎన్‌బీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌లు 0.18-2 శాతం శ్రేణలో పెరిగాయి. 
ఇక స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 37,750 మార్క్‌కుపైన, నిఫ్టీ 11,410 మార్క్‌కుపైన ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,666 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో  37,756 పాయింట్ల వద్ద, నిఫ్టీ తన మునపటి ముగింపు 11,389 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో 11,412 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో 37,796 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37 పాయిట్ల లాభంతో 11,426 పాయింట్ల వద్ద ఉన్నాయి. కాగా మార్కెట్లు మంగళవారం కూడా సరికొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద ఆరంభమయ్యాయి. సెనెక్స్‌ 37,840 మార్క్‌కు పైన, నిఫ్టీ 11,420 మార్క్‌కు పైగా ప్రారంభమయ్యాయి. 



You may be interested

ట్రేడ్‌వార్‌తో పసిడి పరుగు

Wednesday 8th August 2018

ముంబై:- అమెరికా - చైనాల మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న తరుణంలో పసిడి ధర పుంజుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర బుధవారం భారత కాలమానం ప్రకారం గం.10:45 ని.లకు 3.40 డాలర్లు పెరిగి 1,221.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆగస్ట్‌ 23 నుంచి 16 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తామని మంగళవారం అమెరికా మరోసారి ప్రకటించింది. ఇక పసిడిపై

రూ.43 కోట్లు సమీకరించిన సత్య మైక్రో క్యాపిటల్‌

Wednesday 8th August 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఢిల్లీకి చెందిన మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ సత్య క్యాపిటల్‌ రూ.43 కోట్ల నిధులను సమీకరించింది. జపాన్‌కు చెందిన గోజో అండ్‌ కంపెనీ, పాత ఇన్వెస్టర్‌ అయిన డియా వికాస్‌ క్యాపిటల్‌ ఈక్విటీ రూపంలో ఈ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆర్ధిక సంవత్సరంలో రూ.50 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. ఇప్పటివరకు సత్య మైక్రో క్యాపిటల్‌ 11 రాష్ట్రాల్లో సుమారు లక్ష

Most from this category