STOCKS

News


27000పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 31st January 2019
Markets_main1548920838.png-23926

మార్కెట్లో జోరుగా ట్రేడయ్యే బ్యాంక్‌ నిఫ్టీ....జనవరి డెరివేటివ్స్‌ కాంట్రాక్టులకు చివరిరోజైన గురువారం మధ్యాహ్న సమయానికి 27,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. 26,900 పాయింట్ల సమీపంలో ట్రేడైన ఈ సూచీ హెవీవెయిట్‌ బ్యాంకింగ్‌ షేర్లయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు బాసటతో కీలకమైన సాంకేతిక స్థాయి 27,000 పాయింట్లను దాటి మధ్యాహ్నం 1 గంట సమయానికి 27,044 పాయింట్ల వద్దకు చేరింది. బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన యాక్సిస్‌బ్యాంక్‌ 2 శాతం పెరుగుదలతో ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి రూ. 705 వద్దకు చేరగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌లు సైతం అంతేశాతం జంప్‌చేసాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.88 శాతం పెరిగింది. ఎస్‌బీఐ 1 శాతం వరకూ పెరిగింది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, పీఎన్‌బీలు 2 శాతం వరకూ క్షీణించాయి. ఇదే సమయానికి ప్రధాన సూచీ నిఫ్టీ 1 శాతం వరకూ పెరిగి రోజులో గరిష్టస్థాయి 10,766 పాయింట్ల వద్దకు చేరింది. 



You may be interested

ఐటీ షేర్ల ర్యాలీ..ఇన్ఫోసిస్‌ 3 శాతం జంప్‌

Thursday 31st January 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌....వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌ వేసిన ప్రయోజనాన్ని అత్యధికంగా ఐటీ షేర్లు అందిపుచ్చుకున్నాయి. గురువారం ఎన్‌ఎస్‌ఈలోని ఐటీ ఇండెక్స్‌...ఇతర రంగాల సూచీలకంటే అధికంగా 1.5 శాతం పెరిగింది. ఈ సూచీలో భాగమైన ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ 3 శాతంపైగా లాభపడి నెలల గరిష్టస్థాయి రూ. 750 వద్దకు చేరింది. మరో హెవీవెయిట్‌ ఐటీ షేరు టీసీఎస్‌ 1.3 శాతం జంప్‌ చేసింది. టెక్‌ మహింద్రా 2.7

గరిష్టస్థాయి నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ క్షీణత

Thursday 31st January 2019

 ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రితం రోజు వెల్లడించిన ఫలితాలు...మార్కెట్‌ అంచనాల్ని చేరకపోవడం, ఆ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందాకొచ్చార్‌పై బ్యాంకు చర్యలు తీసుకోవడం వంటి అంశాల నేపథ్యంలో గురువారం ఈ కౌంటర్లో గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు వెల్లువెత్తాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం జంప్‌చేసి రూ. 376 స్థాయికి చేరిన తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో ఆ స్థాయి నుంచి మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి రూ. 356 స్థాయికి పడిపోయింది.

Most from this category