STOCKS

News


బంధన్‌ బ్యాంక్‌ 20 శాతం క్రాష్‌

Monday 1st October 2018
Markets_main1538367340.png-20726

ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ షేరు సోమవారం మార్కెట్‌ ప్రారంభంలోనే భారీగా పతనమైంది. స్టాక్‌ 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌లోకి వెళ్లింది. దాదాపు 4,91,723 షేర్ల సెల్‌ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి కొనేవాళ్లు లేరు. బంధన్‌ బ్యాంక్‌ షేరు ధర ఎస్‌ఎస్‌ఈలో 20 శాతం క్షీణతతో రూ.452కు పడిపోయింది.  

లైసెన్స్‌ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ శుక్రవారం కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ పారితోషికాన్ని స్తంభింపజేసింది. ‘‘బ్యాంకులో నాన్‌ ఆపరేటివ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను 40 శాతానికి తీసుకురానందుకు కొత్త శాఖల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. ఇకపై ఏ ఒక్క శాఖ ఏర్పాటు చేయాలన్నా ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండీ, సీఈవో పారితోషికాన్ని మాత్రం తదుపరి నోటీసు జారీ అయ్యే వరకు నిలిపివేయడం జరుగుతుంది’’ అని ఆర్‌బీఐ తమను ఆదేశించినట్లు బంధన్‌ బ్యాంకు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. బ్యాంకులో ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ వాటాను 40 శాతానికి తీసుకొచ్చే లైసెన్స్‌ షరతును పాటించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఆర్‌బీఐకి సహకరిస్తామని బ్యాంకు ప్రకటించింది. కోల్‌కతా కేంద్రంగా 2001లో ఏర్పాటైన మైక్రోఫైనాన్స్‌ సంస్థ బంధన్‌కు యూనివర్సల్‌ బ్యాంకు లైసెన్స్‌ను 2014 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ మంజూరు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 937 శాఖలున్నాయి. 



You may be interested

రూపాయి డౌన్‌..

Monday 1st October 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం బలహీనంగా ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు ఎగయడం, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. రూపాయి సోమవారం 12 పైసలు క్షీణతతో 72.60 వద్ద ప్రారంభమైంది. కాగా రూపాయి శుక్రవారం 72.48 వద్ద ముగిసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు వచ్చే నెల 4న ఉంచి అమల్లోకి రానుండటం వల్ల బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట

ఫ్లాట్‌ ఓపెనింగ్‌.. వెంటనే నష్టాల్లోకి..

Monday 1st October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,227 పాయింట్లతో పోలిస్తే 47 పాయింట్ల లాభంతో 36,274 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,930 పాయింట్లతో పోలిస్తే అక్కడే స్థిరంగా 10,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టా‍ల్లోకి జారిపోయాయి. ఉదయం 9:21 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల నష్టంతో 36,093 వద్ద, నిఫ్టీ 47

Most from this category