STOCKS

News


ఫలితాలతో బజాజ్ ఫైనాన్స్ షేరు పరుగు

Wednesday 24th October 2018
Markets_main1540375368.png-21449

బ్యాంకింగేతర సర్వీసులు అందిస్తున్న బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేరు బుధవారం 13శాతం లాభపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడం, ప్రముఖ రేటింగ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను పెంచడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.2162.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో బజాజ్‌ ఫైనాన్స్‌ స్టాండెలోన్‌ ప్రాతిపదికన 55 శాతం వృద్ధితో రూ.920 కోట్ల నికరలాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం 39 శాతం పెరిగి రూ. 2665 కోట్లను తాకింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 24 శాతం పెరిగి రూ.89,876 కోట్లకు చేరినట్లు కంపెనీ నిన్న ప్రకటించింది. ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో షేరు ఇంట్రాడేలో 13శాతం లాభపడి రూ. 2350.00 గరిష్టాన్ని నమోదు చేసింది.
చివరికి 12శాతం లాభంతో రూ.2333ల వద్ద ముగిసింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 1514.40 రూ.2995.10లుగా నమోదయ్యాయి.



You may be interested

భారతీ ఎయిర్‌టెల్‌ భారీ జంప్‌..

Wednesday 24th October 2018

టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ బుధవారం ఏకంగా 9 శాతంమేర లాభపడింది. ఉదయం నుంచి సాధారణంగానే ట్రేడ్‌ అవుతూ వచ్చిన ఎయిర్‌టెల్‌.. చివరి అరగంటలో బాగా పెరిగింది. నిఫ్టీ-50లో టాప్‌-2 గెయినర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్‌ స్టాక్‌ చివరకు 10 శాతానికిపైగా పెరుగుదలతో రూ.315 వద్ద ముగిసింది. షేరు ధర ఇంట్రాడేలో ఒకానొక సమయంలో ఏకంగా 15 శాతంమేర పెరిగి రూ.328ని కూడా తాకింది. టాప్‌ గెయినర్‌గా బజాజ్‌ ఫైనాన్స్‌

ఎల్‌ఐసీ వాటా పెంచుకున్న షేర్లివే..

Wednesday 24th October 2018

దేశీ అతిపెద్ద ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఎల్‌ఐసీ సెప్టెంబర్‌ క్వార్టర్‌లో తన పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంది. కంపెనీ షేర్‌హోల్డింగ్‌ గణాంకాల ప్రకారం చూస్తే.. ప్రధానంగా ఫైనాన్షియల్స్‌, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కెమికల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో మార్పులు కనిపించాయి. కాగా ఎల్‌ఐసీకి 320 కంపెనీల్లో వాటాలున్నాయి.  ఆటో రంగ కంపెనీలైన హీరో మోటొకార్ప్‌, మారుతీ సుజుకీలలో వాటాలు పెంచుకుంది. హీరో మోటొకార్ప్‌లో వాటాను 6.4 శాతం నుంచి 6.45 శాతానికి,

Most from this category