STOCKS

News


కీలక షేర్లపై యస్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు

Saturday 6th April 2019
Markets_main1554546724.png-24994

బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, గోద్రేజ్‌ప్రాపర్టీస్‌ షేర్లు ఇటీవలే ఏడాది గరిష్ఠాలను తాకాయి. ఈ నేపథ్యంలో వీటిని ఇకపై ఎలా ట్రేడ్‌ చేయవచ్చనే విషయంలో యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్టు ఆదిత్య అగర్వాల్‌ అభిప్రాయాలు..
1. బజాజ్‌ ఫైనాన్స్‌: అప్‌ట్రెండ్‌ బలంగా కొనసాగవచ్చు. చార్టుల్లో బలహీనత కనిపించడంలేదు. రాబోయే రోజుల్లో రూ. 3400ను తాకవచ్చు.
2. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌: ఇకపై అప్‌మూవ్‌ పరిమితంగా ఉండొచ్చు. రూ. 7660 వరకు పెరిగే ఛాన్సులున్నాయి.
3. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌: బుల్‌ట్రెడ్‌ బలంగా ఉంది. ఎన్నికల ఏడాది సాధారణంగా రియల్టీ రంగ షేర్లు అదరగొడతాయి. ఈ నేపథ్యంలో ఈ షేరు రూ. 1200 వరకు దూసుకుపోవచ్చు. 
4. హెచ్‌డీఎఫ్‌సీ: గత గరిష్ఠం రూ. 2050ని దాటి కొత్త గరిష్ఠాలను తాకింది. అందువల్ల రూ. 2200 వరకు ర్యాలీ ఉండొచ్చు.
5. పిడిలైట్‌: చార్టుల్లో ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ పాటర్న్‌ నుంచి బయటపడినట్లు కనిపిస్తోంది. అయితే బాగా ఓవర్‌బాట్‌ జోన్‌లో ఉన్నందున అప్‌మూవ్‌ పరిమితంగా ఉండొచ్చు. ఈ ట్రెండ్‌లో రూ. 1350 వరకు వెళ్లే చాన్సులున్నాయి. ఒకవేళ రూ. 1230 స్థాయిలకు పతనమైతే మరోమారు కొనుగోళ్లకు అవకాశంగా చూడొచ్చు. 

 



You may be interested

బ్యాంకు నిఫ్టీ 35వేలకు!

Saturday 6th April 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా ఈ ఏడాది ర్యాలీకి బ్యాంకింగ్‌ రంగమే సారధ్యం వహిస్తోంది. బ్యాంకు నిఫ్టీ చెలరేగిపోవడంతో గత సీరిస్‌లో ప్రధాన సూచీలు సైతం పరుగులు పెట్టాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల జోరు ఏడాది మొత్తం కొనసాగుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. 2019లో బ్యాంకు నిఫ్టీ 34-35వేల పాయింట్లను చేరుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సహజ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ సీరిస్‌లో నిఫ్టీకి 11570 పాయింట్ల వద్ద బలమైన మద్దతు

టెలికం కంపెనీల నుంచి మంచి ఫలితాలు!?

Saturday 6th April 2019

క్యు4పై బ్రోకరేజ్‌ల అంచనాలు దాదాపు 11 నెలల తర్వాత తొలిసారి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ రెవెన్యూలు గణనీయమైన వృద్ధి నమోదు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మినిమం రిచార్జ్‌ ప్లాన్లు, అధిక వాయిస్‌, డేటా ప్యాక్‌ల విక్రయాల్లో జోరు.. టెల్కోలకు క్యు4లో కలిసివస్తాయని అంచనా. ఆరంభం నుంచి అదరగొడుతున్న జియో ఇన్ఫోకామ్‌ ఎప్పటిలాగే ముందంజలో ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. జియో ఆరంభించిన ధరల యుద్ధంతో కుదేలైన ఇతర

Most from this category