STOCKS

News


బ్యాడ్‌న్యూస్‌.. బ్రహ్మాండమైన అవకాశం..

Friday 14th December 2018
Markets_main1544783552.png-22940

ఇన్వెస్టర్లకు సెంట్రమ్‌ సూచన
ప్రపంచ క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రను పరిశీలిస్తే బ్యాడ్‌న్యూస్‌ వచ్చినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి అవకాశమని నిరూపితమైందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రిసెర్చ్‌ హెడ్‌ జగన్నాధ్‌ తూనుగుంట్ల చెప్పారు. స్వల్పకాలిక ఆటుపోట్లను తట్టుకునే నాణ్యమైన స్టాకులను పరిశీలించడం మంచిదని సూచించారు. గత మూడునెలలుగా ఎన్‌బీఎఫ్‌సీలు, లిక్విడిటీ, రియల్టీ, క్రూడాయిల్‌ ధర, ఆర్‌బీఐ, ఎన్నికల ఫలితాలు.. ఇలా అనేక దుర్వార్తలు మార్కెట్‌ను చుట్టుముట్టాయి. దీంతో నిఫ్టీ దాదాపు 10 శాతం పతనమైంది. కొన్ని స్టాకులైతే మరింత క్షీణించాయి. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పూర్తయినందున ఒక అనిశ్చితి తొలగినట్లయిందని జగన్నాధ్‌ చెప్పారు.

గత పాతికేళ్ల చరిత్ర చూస్తే ఎన్నికల ఫలితాల ప్రభావం మార్కెట్లపై స్వల్పకాలికమేనన్నారు. రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా మార్కెట్లు దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తూనే ఉంటాయన్నారు. అంతేకాకుండా ఎలాంటి చెడ్డ వార్తల ప్రభావమైనా కొంతకాలమే ఉంటుందని, తిరిగి మంచి వార్తలు రాగానే మార్కెట్లు పురోగమిస్తాయన్నారు. అందువల్ల ఇలాంటి చెడు పరిణామాలను పెట్టుబడులకు అవకాశంగా పరిగణించాలని తెలిపారు. ఎన్నికల్లో సుస్థిరత కోసం మార్కెట్లు చూస్తాయని, ఏ పార్టీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నా మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందిస్తాయని తెలిపారు. 
సాధారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్‌ బాటమ్‌లో ఉన్నప్పుడు బేరిష్‌గా, టాప్‌లో ఉన్నప్పుడు బుల్లిష్‌గా స్పందిస్తారుని జగన్నాధ్‌ చెప్పారు. కానీ నిజానికి ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తేనే మార్కెట్లో లాభపడవచ్చని సూచించారు. ఇప్పుడు కూడా ఇన్వెస్టర్లు సూచీల చుట్టూ అలముకున్న చీకట్లను చూసి బేరిష్‌గా ఉంటారని, కానీ ఇదే పెట్టుబడులకు అవకాశంగా మలచుకునే తరుణమన్నారు. అందరూ అమ్ముతున్నప్పుడు మనం కొనడమే విజయానికి తొలిమెట్టన్నారు. 
దీర్ఘకాలానికి హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్‌ లైఫ్‌, సీడీఎస్‌ఎల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, నెస్లె షేర్లను ఆయన సిఫార్సు చేశారు. లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లు నాణ్యమైన స్టాకులను విడతలవారీగా(ముందు కొన్ని కొనడం, ధర కాస్త పతనమైతే మరికొన్నింటిని కొనడం..) కొనుగోలు చేయాలని సూచించారు. You may be interested

సరైన ధర.. అంటే?

Friday 14th December 2018

మార్కెట్లో కాస్తో కూస్తో ట్రేడింగ్‌ చేసే ప్రతిఒక్కరికీ సరైన ధర వద్ద షేర్లు కొనమనే సూచనలు తెలిసే ఉంటాయి. ప్రతి అనలిస్టూ ఇదే సలహా ఇస్తుంటారు. అసలింతకీ ఒక షేరుకు సరైన ధర అంటే ఎలా నిర్ధారిస్తారు? అనేది ప్రతిఒక్కరికీ వచ్చే సందేహం. దీన్ని తీర్చుకోవాలంటే కాస్త విపులంగా చర్చించుకోవాలి. ఒక షేరు వాల్యూ(విలువ)కు, (ప్రైస్‌)ధరకు మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు కొనుగోలు చేయాలన్నది ఈక్విటీ మార్కెట్లో సాధారణ సూత్రం. వారెన్‌

10800 పైన నిఫ్టీ

Friday 14th December 2018

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట కొనుగోళ్ల కారణంగా లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ సూచీ 33 పాయింట్ల లాభంతో 35,963 వద్ద, నిఫ్టీ సూచీ 14 పాయింట్లు లాభపడి 10800 పైన 10,805 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 26,826 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ షేర్లు లాభపడగా, ఫైనాన్స్‌ సర్వీసెన్‌, ఫార్మా రంగాలకు చెందిన

Most from this category