STOCKS

News


ఆల్‌టైం హైకి యాక్సిస్‌ బ్యాంక్‌

Wednesday 30th January 2019
Markets_main1548822473.png-23887

ప్రైవేట్‌రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు షేరు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఆల్‌టైం గరిష్టాన్ని అందుకుంది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు బీఎస్‌ఈలో షేరు గతముగింపు(రూ.660.8)తో 4శాతం లాభంతో రూ.687.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 6.50శాతం ర్యాలీ చేసి రూ.703.00వద్ద ఆల్‌టైం హైకి అందుకుంది. ఉదయం గం.9.45ని.లకు షేరు 5శాతం లాభంతో రూ.694.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీల్లో టాప్‌ -5 గెయినర్లలో మొదటిస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.
యాక్సిస్‌ బ్యాంక్‌ క్యూ3 ఫలితాలు:-
నికర వడ్డీ ఆదాయం 18.4శాతం వృద్ధితో రూ.5,602.9 కోట్లను ఆర్జించింది.
నికర లాభం 2.3రెట్లు పెరిగి రూ.1,680.9 కోట్లకు చేరింది.
రూ.3,054.5 కోట్ల ప్రొవిజన్స్‌ నమోదు చేసింది
స్థూల ఎన్‌పీఏలు క్వార్టర్‌ టు క్వార్టర్‌ 5.96శాతం నుంచి 5.75శాతానికి దిగివచ్చాయి.
నికర ఎన్‌పీఏలు క్వార్టర్‌ టు క్వార్టర్‌ 2.54శాతం నుంచి 2.36 శాతానికి పరిమితమయ్యాయి.



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీగా పుర్వార్‌?

Wednesday 30th January 2019

ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి సిఫారసు న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) పదవికి ఎంటీఎన్‌ఎల్‌ సీఎండీ ప్రవీణ్‌ కుమార్‌ పుర్వార్‌ పేరును ప్రభుత్వరంగ సంస్థల నియామక బోర్డు సిఫారసు చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుత సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ పదవీకాలం జూన్‌తో ముగియనుంది. ఏడాదిన్నర క్రితం శ్రీవాస్తవ బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టగా, తన పదవీకాలంలో సంస్థ కార్యకలాపాలను గాడిలో పెట్టే చర్యలను అమలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.672

బంగారంపై దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలి

Wednesday 30th January 2019

కట్‌, సానబెట్టిన వజ్రాలు, రత్నాలపైనా తగ్గించాలి నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు ఇంకా వేధిస్తున్నాయ్‌ కేంద్ర ఆర్థిక శాఖను కోరిన రత్నాభరణాల పరిశ్రమ టీవీ, ఏసీ, ప్రిడ్జ్‌లపై దిగుమతి సుంకాలు పెంచాలి దేశీయ తయారీని పెంచేందుకు ఇది అవసరం కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారుల సంఘం వినతి ముంబై: నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకూ ప్రభావాలను ఇంకా ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని

Most from this category