News


హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐదు ఫండమెంటల్స్‌ పిక్స్‌

Saturday 15th September 2018
Markets_main1536952323.png-20261

మార్కెట్‌ గరిష్ట విలువకు చేరినందున కరెక్షన్‌కు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌జసాని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు... సమర్థవంతమైన యాజమాన్యం, ఆపరేటింగ్‌ మార్జిన్‌ వ్యత్యాసం తక్కువగా ఉండి, ఆదాయ అవకాశాలు మంచిగా ఉన్న నాణ్యమైన స్టాక్స్‌పై దృష్టి సారించాలని జసాని సూచించారు. కరెంటు ఖాతా లోటు ఆందోళనలు, వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోవడం, రూపాయి పతనానికి కళ్లెం వేసేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్టు తెలిపారు. విధాన నిర్ణేతల నుంచి నిర్మాణాత్మ చర్యలు లోపించడంతో ఫారెక్స్‌ మార్కెట్‌, బాండ్‌ మార్కెట్‌పై ప్రతికూలతలు కొంత కాలం పాటు కొసాగుతాయని భావిస్తు‍న్నట్టు చెప్పారు. నిరాటంకమైన అంతర్జాతీయ సమస్యలు డాలర్‌ బలోపేతానికి దారితీశాయని, వచ్చే ఒకటి రెండేళ్ల పాటు రూపాయి రూ.73.50-68.50 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది, రెండేళ్ల కాలానికి విలువల పరంగా, వృద్ధికి, రాబడులకు అవకాశం ఉన్న ఐదు స్టాక్స్‌ను జసాని సూచించారు.

 

మహానగర్‌ గ్యాస్‌
సిటీ గ్యాస్‌ పంపిణీ గుత్తాధిపత్యం కలిగి ఉన్న తరహా వ్యాపారం కావడం, కొత్త ప్రాంతాల్లోకి కంపెనీ కార్యకలాపాల విస్తరణ అన్నవి రానున్న సంవత్సరాల్లో ఆదాయాలను పెంచుతాయి. చమురు ధరలు పెరిగిపోతున్న క్రమంలో కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)/పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ)కు, లిక్విడ్‌ ఇంధనాల(పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ)కు మధ్య ఆర్థికంగా చాలా వ్యత్యాసం ఉంది. 

 

యాక్సిస్‌ బ్యాంకు
తదుపరి దశ వృద్ధి కోసం యాక్సిస్‌ బ్యాంకు అవసరమైన పెట్టుబడులను పెట్టింది. ఫ్రాంచైజీల విస్తరణ చేపట్టింది. బ్యాంకులో ఉన్న సమస్యల ప్రభావాన్ని ఇప్పటికే షేరు ధర సర్దుబాటు చేసుకుంది. పోటీ బ్యాంకులతో పోలిస్తే యాక్సిస్‌ బ్యాంకు షేరు ఆకర్షణీయమైన విలువల వద్ద లభిస్తోంది. కొత్త సీఈవో బ్యాంకు వృద్ధి ప్రణాళికలకు నూతన కోణాన్ని ఆవిష్కరించనున్నారు.

 

రికో ఆటో
2015లో ఎఫ్‌సీసీతో విడిపోయిన తర్వాత రికో ఆటో తన విధానాన్ని మార్చుకుంది. ద్విచక్ర వాహనాలకు తోడుగా ప్యాసింజర్‌, కమర్షియల్‌ వెహికల్‌ మార్కెట్లకూ తన ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించింది. ఆర్డర్‌బుక్‌ బలంగా రూ.4,800కోట్లు ఉండడం, సామర్థ్య విస్తరణ, అలాయ్‌ వీల్స్‌ అమ్మకాలు పెరుగుతుండడం, ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో మారడం వల్ల కంపెనీ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ మెరుగపడనుంది. రికో ఆటో మరో మూడు నూతన ఉత్పత్తులను విడుదల చేయనుంది. లాభాలు మెరుగుపడితే స్టాక్‌ ధర రీరేటింగ్‌ అవుతుంది.

 

ఇంజనీర్స్‌ ఇండియా
ఇంజనీర్స్‌ ఇండియా హైడ్రోకార్బన్‌, పెట్రోకెమికల్‌ పరిశ్రమలో సామర్థ్య విస్తరణ ప్రణాళికలతో లాభపడనుంది. ఈ రంగానికి సలహా సేవల్లో ఇంజనీరింగ్స్‌ ఇండియా అగ్రగామి కంపెనీ. రుణ రహిత కంపెనీ కావడం, 7,229 కోట్ల ఆర్డర్లు ఉండడం, నగదు బ్యాలన్స్‌ రూ.2,500 కోట్ల మేర ఉండడంతో మరో విడత షేర్ల బైబ్యాక్‌ లేదా ప్రత్యేకమైన డివిడెండ్‌తో వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.

 

సన్‌ ఫార్మా
అమెరికా స్పెషాలిటీ ఔషధాల విభాగంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టిన భారత ఫార్మా కంపెనీల్లో సన్‌ ఫార్మా ఒకటి. కీలకమైన ఔషధాల విడుదలతో కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్‌ మెరుగుపడనుంది. అలాగే, అమెరికాలో ధరలు తగ్గుదల ప్రభావం కూడా తొలగిపోనుంది. కంపెనీకి అమెరికాలో 422 ఉత్పత్తులకు ఆమోదం ఉండగా, మరో 139 ఉత్పత్తులు ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Saturday 15th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 4 పాయింట్ల నష్టంతో 11,543 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11,547 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

కంపెనీకి సంబంధించి కీలక ఫైనాన్షియల్‌ ఇండికేటర్లు

Saturday 15th September 2018

స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు, ఎవరో ఒకరు సూచించిన వాటిని కొనుగోలు చేయడం కంటే, తమకు తాముగా పరిశోధన చేసి ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అలాగే, అనలిస్టులు సూచించిన స్టాక్స్‌ విషయంలోనూ కీలక ఆర్థిక గణాంకాలను పరిశీలించి ఇన్వెస్ట్‌ చేయాలా, లేదా అన్నది తమకు తాము నిర్ణయించుకోవచ్చు. ఈ విషయంలో ప్రతీ ఒక్క ఇన్వెస్టర్‌ ఓ కంపెనీకి సంబంధించి చూడాల్సిన ముఖ్యమైన ఫైనాన్షియల్‌ ఇండికేటర్లను వ్యాల్యూ

Most from this category