STOCKS

News


నేటి నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ ఓఎఫ్‌ఎస్‌

Tuesday 12th February 2019
Markets_main1549951387.png-24151

  • ఫ్లోర్‌ ధర రూ.689.52
  • రేపు రిటైల్‌ ఇన్వెస్టర్లకు

న్యూఢిల్లీ:  యాక్సిస్‌ బ్యాంక్‌లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని నేడు ప్రభుత్వం విక్రయిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌లో ఎస్‌యూయూటీఐ (ద స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌ ఆఫ్‌ యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ఇండియా)ద్వారా ఉన్న వాటాలో  3 శాతం వరకూ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నది. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా 1.98  శాతం వాటాకు సమానమైన 5.07 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేస్తోంది. దీంట్లో 10 శాతం వాటా షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మరో 1.02 శాతం వాటాకు సమానమైన 2.63 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించే అవకాశముంది.  ఈ షేర్ల విక్రయానికి ఫ్లోర్‌ ధరగా రూ.689.52ను నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర(రూ.710.35) కంటే దాదాపు 3 శాతం తక్కువ. వాటా విక్రయం సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు (మంగళవారం), రిటైల్‌ ఇన్వెస్టర్లకు బుధవారం జరుగుతుంది. ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో భాగంగాగానే యాక్సిస్‌ బ్యాంక్‌ వాటా విక్రయం జరుగుతోంది. కాగా ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.36,000 కోట్లు సమీకరించింది.



You may be interested

35వేల మందికి వీఆర్‌ఎస్‌

Tuesday 12th February 2019

ఎల్‌టీసీ తదితర ప్రయోజనాల నిలిపివేత వ్యయాలు తగ్గించుకునేందుకు బీఎస్‌ఎన్ఎల్ చర్యలు న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ పలు వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఎల్‌టీసీ తదితర ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 35,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) అమలు చేయాలని భావిస్తోంది. సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ ఈ విషయాలు తెలియజేశారు. వ్యయ నియంత్రణ చర్యలతో

ఎలారా క్యాపిటల్‌ నుంచి క్వాలిటీ పిక్స్‌

Tuesday 12th February 2019

బడ్జెట్‌ ముగిసిపోవడంతో ఇకపై దేశీయ సూచీలు రాజకీయ యాక్టివిటీ జోన్‌లోకి అడుగుపెడుతున్నాయని ఎలారా క్యాపిటల్‌ అభిప్రాయపడింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ సంక్షోభం లాంటివి రాజకీయ ప్రకంపనలకు ఉదాహరణలని తెలిపింది. సాధారణ ఎన్నికలు ముగిసే వరకు ఇదే ధోరణి ఉంటుందని పేర్రొకంది. ఈ ఏడాది మిడ్‌క్యాప్స్‌ ఇప్పటికే 7 శాతం పతనమయ్యాయని తెలిపింది. ప్రధాన సూచీలతో సహా మార్కెట్లన్నీ ఆటుపోట్లకు గురయ్యే వేళ హైక్వాలిటీ స్టాక్స్‌ మాత్రమే నాణ్యమైన ఫలితాలు

Most from this category