STOCKS

News


యాక్సిస్‌ బ్యాంక్‌... ఆల్‌టైమ్‌ హై

Monday 10th September 2018
Markets_main1536564510.png-20127

ముంబై:- కొత్త ఛైర్మన్‌గా అమితాబ్ చౌదరి నియామకం ఖరారు కావడంతో యాక్సిస్ బ్యాంకు షేరు సోమవారం ఆల్‌టైం హైని తాకింది. నేడు బీఎస్‌ఈలో యాక్సి్‌స్‌ బ్యాంకు షేరు రూ.645.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో అమితాబ్ చౌదరిని నియమిస్తున్నట్లు శనివారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్నట్టు యాక్సిస్‌ బ్యాంకు ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో నేటి ఇంట్రాడే షేరు ఏకంగా 5శాతం లాభపడి రూ.676.90ల వద్ద రికార్డు గరిష్టస్థాయిని తాకింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు షేరు గతముగింపు ధర(రూ.645.15)తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.652ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.447.80 రూ.676.90లుగా నమోదయ్యాయి.
యాక్సిస్‌ బ్యాంక్‌ కొత్త ఛైర్మన్‌గా అమితాబ్ చౌదరి:-
యాక్సిస్ బ్యాంకు కొత్త సీఈవో, ఎండీగా అమితాబ్ చౌదరి  నియమితులయ్యారు. ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. శిఖాశర్మ పదవీకాలం ఈ ఏడాది చివరినాటికి ముగియున్న నేపథ్యంలో శనివారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కొత్త ఛైర్మన్‌గా అమితాబ్ చౌదరి ఎంపిక చేసినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. తమ నిర్ణయానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. బ్యాంకు ఎండీ, సీఈవోగా చౌదరి 1 జనవరి 2019 నుంచి 31 డిసెంబరు 2021 వరకు మూడేళ్లపాటు తన సేవలను అందించనున్నారని బ్యాంకు తెలిపింది.



You may be interested

మార్కెట్‌ పడ్డా.. ఈ షేర్లలో రిటర్న్స్‌కు ఛాన్స్‌!!

Monday 10th September 2018

మార్కెట్లు సోమవారం ఢమాల్‌ అంటున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ బాగా పడిపోతున్నాయి. రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి పడిపోవడం ఇందుకు కారణం. వాణిజ్య ఉద్రిక్తతలు, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్‌ ఉండొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి సమయాల్లో ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనే ప్రశ్న మదిలో మెదిలో ఉంటుంది. మీ ప్రశ్నకు సమాధానమే ఈ

మార్కెట్‌కు రూపీ పోటు..సెన్సెక్స్‌ 300 పాయింట్లు డౌన్‌

Monday 10th September 2018

నెగటివ్‌లో ప్రారంభమైన మార్కెట్లు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే ఇండెక్స్‌ల నష్టాలు బాగా పెరిగాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా పడిపోతే.. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పతనమైంది. మధ్యాహ్నం 12:02 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 330 పాయింట్ల నష్టంతో 38,061 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 11,482 వద్ద ట్రేడవుతున్నాయి. రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 72.57కి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపింది. రూపాయి ఒక్క రోజులో

Most from this category