STOCKS

News


కొత్త ఛైర్మెన్‌ నియామకంపై అంచనాలు-యాక్సిస్‌ బ్యాంక్‌ 2శాతం అప్‌..!

Friday 24th August 2018
Markets_main1535104264.png-19605

  • కొత్త సీఈవో అమితాబ్‌ చౌదరి..?

ముంబై:- యాక్సిస్‌ బ్యాంకు కొత్త ఛైర్మన్‌గా అమితాబ్‌ చౌధరి నియామకం జరగవచ్చనే వార్తలతో ఆ బ్యాంకు షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 2శాతం ర్యాలీ చేసింది. నేడు యాక్సి బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో రూ.631.8ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం బ్యాంకు ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న శిఖాశర్మ స్థానంలో హెచ్‌డీసీఎఫ్‌సీ లైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమితాబ్‌ చౌదరి నియమితులుకావొచ్చనే అంచనాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి.  ఈ నియామకానికి సంబంధించిన ఇప్పటికే ఇంటర్యూ పూర్తి అయ్యింది. రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి తుది అనుమతులు దక్కాల్సి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి శిఖా శర్మ మే 31, 2018న పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ గతేడాది డిసెంబర్ చివర్లో బోర్డు ఆమె పదవీ కాలాన్ని మరో మూడేండ్లు అంటే 2021 నాటికి పెంచింది. ఆమె పదవీకాలాన్ని 3ఏళ్లు పెంచడంపై ఆర్బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తన పదవి కాలాన్ని కేవలం ఈ ఏడాది చివరి నాటికి (డిసెంబరు 31)పెంచాలని యాక్సిస్ బ్యాంక్ బోర్డును కోరింది. ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన బోర్డు ఈ ఏడాది చివర వరకు సేవలందించాల్సిందిగా కోరింది. డిసెంబరు 31న శిఖాశర్మ పదవికాలం ముగుస్తన్న నేపథ్యంలో యాక్సిస్‌ బోర్డు కొత్త సీఈవో వేటలో పడింది. కొత్త సీఈవో నియమాకం వార్తలు వెలుగులోకి రావడంతో యాక్సిస్‌ బ్యాంకు షేరు శుక్రవారం ఇంట్రాడేలో 2శాతం లాభపడి రూ.642.75ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం గం.3:10ని.లకు షేరు గత ముగింపు(రూ.631.8)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.639.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 447.80 రూ.643.50లుగా నమోదయ్యాయి.You may be interested

ఇండియా బాండ్లతో హెడ్జింగ్‌

Friday 24th August 2018

చైనా మందగమనం తట్టుకొనేందుకు జేపీ మోర్గాన్‌ సూచన వర్ధమాన మార్కెట్ల బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసేవాళ్లు చైనా మందగమన ప్రభావాన్ని తట్టుకునేందుకు భారత ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ డాలర్‌ బాండ్స్‌ను ఆశ్రయించాలని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ సూచించింది. వర్ధమాన మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఇండియా ఐజీ బాండ్లు చైనా హెడ్జింగ్‌లాగా ఉపయోగపడతాయని తెలిపింది. చైనాలో మందగమన భయాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కమోడిటీలు నేల చూపులు చూస్తున్నాయి. ఈ పరిణామాలు వర్ధమాన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అయితే

ఫెడరల్‌ బ్యాంక్‌పై తటస్థం

Friday 24th August 2018

బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఫెడరల్‌ బ్యాంక్‌పై తటస్థ వైఖరిని వ్యక్తపరిచింది. ఎందుకో ఒకసారి చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఫెడరల్‌ బ్యాంక్‌ రేటింగ్‌: తటస్థం ప్రస్తుత ధర: రూ.81 టార్గెట్‌ ధర: రూ.103 ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌పై తటస్థంగా ఉంది. టార్గెట్‌ ధరను రూ.103గా కొనసాగించింది. కేరళ వరదలు బ్యాంక్‌ పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది. బ్యాంక్‌కు కేరళలో ఉన్న బ్రాంచ్‌ల

Most from this category