STOCKS

News


జీవితకాల గరిష్టానికి యాక్సిక్‌ బ్యాంక్‌

Thursday 17th January 2019
Markets_main1547717758.png-23640

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ షేరు టార్గెట్‌ ధరను పెంచడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు గురువారం 2శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.668.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జనవరి 1 నుంచి కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అమితాబ్ చౌధరి బ్యాంకు అభివృద్ధికి గుణాత్మకమైన మార్పులు చేపడతారని కంపెనీ బ్రోకరేజ్‌ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో షేరు 15శాతం ఆదాయాన్ని సమకూరుస్తుందని అంచనా వేస్తుంది. అలాగే షేరుకు గతంలో తాము కేటాయించిన రూ.750ల టార్గెట్‌ ధరను రూ.800లకు పెంచుతున్నట్లు సీఎల్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 2శాతం పెరిగి రూ.678.90 ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర యాక్సిస్‌బ్యాంక్‌కు జీవితకాల గరిష్టస్థాయి కావటం విశేషం. మధ్యాహ్నం‍ గం.3:00లకు షేరు గతముగింపు ధర రూ.663.65తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.677ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.477.50 రూ.678.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ పీఎస్‌యూ షేర్లు ఆకర్షణీయం!

Thursday 17th January 2019

సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు దేశీయ మార్కెట్లో కొన్ని ఎంపిక చేసిన పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన రిస్కురివార్డును ఆఫర్‌ చేస్తున్నాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. పలు పీఎస్‌యూ షేర్లు వాటి ఆల్‌టైమ్‌ లో వద్ద ట్రేడవుతున్నాయని తెలిపింది. ఈ రేటు వద్ద వాటి పీఈలు చాల తక్కువగా ఉన్నాయని, అందువల్ల రివార్డు బాగుంటుందని వివరించింది. నిఫ్టీతో పోలిస్తే ఈ పీఎస్‌యూల వాల్యూషన్లు దాదాపు 50 శాతం తక్కువగా ఉన్నాయని

ముందుంది మాంద్యం!

Thursday 17th January 2019

శంకిస్తున్న యూఎస్‌ దిగ్గజ కంపెనీలు ఒక సంవత్సరంలోపు మరోమారు ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చని ప్రముఖ అమెరికన్‌ కంపెనీలు అనుమానిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఈ కంపెనీలు తమ ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గిస్తున్నాయి. దీనికితోడు ఈల్డ్స్‌ గ్రాఫ్‌లో ట్రెండ్‌ కూడా మాంద్యానికి సంకేతాలిస్తోంది. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు మాంద్యం తప్పదని భావిస్తున్నారు. గత మూడు నెలల్లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అనూహ్యంగా కిందకు దిగజారింది. ప్రపంచ జీడీపీ 2.5 శాతానికి పరిమితమయింది. దీంతో

Most from this category