STOCKS

News


హౌసింగ్‌, కన్జూమర్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు దూరం!

Wednesday 24th October 2018
Markets_main1540378322.png-21452

దేశీయ మార్కెట్లో ఇప్పటివరకు దుమ్మురేపిన కొన్ని రంగాలు ఇకపై చతికిలపడతాయని, ఇదే సమయంలో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న రంగాలు జోరు పెంచుతాయని యూటీఐ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ లలిత్‌ నంబియార్‌ అభిప్రాయపడ్డారు. హౌసింగ్‌, కన్జూమర్‌ ఫైనాన్స్‌ రంగాలు ఇకపై అంతంతమాత్రంగా ఉంటాయని, ఫార్మా రంగంలో దూకుడు కనిపించవచ్చని అంచనా వేశారు. మూలాలపై బలమైన నమ్మకం ఉన్న కంపెనీలను ఎంచుకున్నవాళ్లు కరెక‌్షన్‌కు భయపడాల్సిన పనిలేదన్నారు. కంపెనీలు చేసే వ్యాపార నాణ్యతపై విశ్వాసం, గత ట్రాక్‌ రికార్డు, వాల్యూషన్లు.. షేరు ఎంపికలో కీలకమని చెప్పారు. మార్కెట్లో ఎంటరయ్యేందుకు మంచి సమయం, తగని సమయం అని తేడాలుండవన్నారు. ప్రస్తుత పతనం తర్వాత కూడా నిఫ్టీ సరాసరి పీఈ కన్నా అధికంగానే ట్రేడవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎర్నింగ్స్‌ అంచనాలు కొంత మేర డౌన్‌ సైడ్‌ రివిజన్‌ ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. 
వాల్యూరంగాలే బెటర్‌
ఫార్మాతో పాటు మరికొన్ని వాల్యూరంగాలు ఇకపై సత్తా చూపుతాయని లలిత్‌ అంచనా వేశారు. ఇప్పటివరకు హవా చూపిన గ్రోత్‌ రంగాలు కొంచెం నెమ్మదిస్తాయన్నారు. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ కట్టడికే ఎక్కువ ప్రాధానమిస్తోందన్నారు. రూపీ కదలికల్లో అసమానతలపై దృష్టిపెడతామని, రూపీ లెవల్స్‌పై కాదని ఆర్‌బీఐ తన చర్యలతో వెల్లడిస్తోందన్నారు. క్రమంగా ద్రవ్యోల్బణం ప్రభావం చూపడం ఆరంభిస్తే ఆర్‌బీఐ రేట్ల పెంపును కొనసాగించవచ్చన్నారు. వడ్డీరేట్లు, డాలర్‌ మారకం బలపడడంతో యూఎస్‌లో లిక్విడిటీ కొరత వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేశారు. రేట్లు తగ్గినప్పుడు లాభపడ్డ రంగాలు ఇకపై తలనొప్పులు ఎదుర్కొంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Thursday 25th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:31 సమయంలో ఏకంగా 101 పాయింట్ల నష్టంతో 10,136 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,228 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

10,200 పైన నిఫ్టీ ముగింపు

Wednesday 24th October 2018

దిగివచ్చిన చమురు ధరలు నాలుగురోజుల నష్టాలకు బ్రేక్‌ ముంబై:- ముడి చమురు ధరలు దిగిరావడంతో మార్కెట్‌ నాలుగురోజుల వరుస నష్టాలకు బుధవారం బ్రేక్‌ పడింది. చివరి గంటలో మెటల్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో సెన్సెక్స్‌ తిరిగి 34000 వేల మార్కును నిఫ్టీ 10200 మార్కును అందుకున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలపడం కూడా సూచీల ర్యాలీకి మరో కారణమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 187 పాయింట్లు లాభపడి 34034 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ

Most from this category