STOCKS

News


ఏవియేషన్‌ షేర్లు ట్రేడర్లకే .. ఇన్వెస్టర్లకు కాదు..

Friday 16th November 2018
Markets_main1542356364.png-22096

ఏవియేషన్‌ రంగాన్ని కఠినమైనదిగా భావించొచ్చు. ఇందులో కంపెనీలకు ప్రైసింగ్‌ పవర్‌ ఉండదు. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే ఆయిల్‌ ధరలతో ఎల్లప్పుడూ రిస్క్‌ పొంచి ఉంటుంది. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏస్‌ప్రో అడ్వైజర్స్‌ సీఐవో కుంజ్‌ బన్సాల్‌ ఈ విషయాలను వెల్లడించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ స్టాక్‌ ర్యాలీ విషయానికి వస్తే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉందని తెలిపారు. ఇటీవల కాలంలో క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల నుంచి 85 డాలర్లకు పెరిగాయని గుర్తు చేశారు. క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 60 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కూడా ఏవియేషన్‌ షేర్లు గొప్పగా డబ్బుల్ని సంపాదించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఏవియేషన్‌ రంగంలో ప్రైసింగ్‌ పవర్‌ లేదని తెలిపారు. 15 ఏళ్ల క్రితం ఢిల్లీ-ముంబై టికెట్‌ రూ.5,000గా ఉందని, ఇప్పుడు కూడా ఆ మార్గంలో టికెట్‌ ధర రూ.5,000గానే ఉందని పేర్కొన్నారు. కేవలం క్రూడ్‌ ధరల్లో మాత్రమే వ్యత్యాసం వచ్చిందని తెలిపారు. ఏవియేషన్‌ ట్రేడింగ్‌కు అనువైన రంగమని అభిప్రాయపడ్డారు. టాటా చర్చల కారణంగా జెట్‌ షేరు ధర పెరిగిందని, కొనుగోలుకు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండొచ్చని తెలిపారు. చర్చలు సఫలం కావొచ్చు.. విఫలం కావొచ్చు.. ఏం జరిగినా కూడా ఏవియేషన్‌ షేర్లు ట్రేడర్లకు అనువైనవే తప్ప ఇన్వెస్టర్లకు కలిసిరావని పేర్కొన్నారు. దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఏవియేషన్‌ షేర్లలో సంపాదించిన రుజువులు లేవని తెలిపారు. ఏవియేషన్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్లకు ఎప్పుడూ లాభాలను అందించలేదని పేర్కొన్నారు. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి వాటితో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంక్‌ వ్యాల్యుయేషన్స్‌ చౌకగా ఉన్నాయని కుంజ్‌ బన్సాల్‌ తెలిపారు. మేనేజ్‌మెంట్‌ సమస్యలు, ఎన్‌పీఏల పెరుగుదల, ఆర్థిక పరిస్థితులు, మార్కెట్‌ స్థితిగతులు ఇలా పలు సవాళ్ల కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు గత మూడేళ్లుగా అండర్‌పర్ఫార్మ్‌ చేస్తూ వచ్చిందన్నారు. అయితే ఇటీవల స్వల్ప కాలంలోనే బాగా పెరిగిందని తెలిపారు. 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. సమీప కాలంలో చూస్తే స్టాక్‌ వేగంగా పెరగడం కారణంగా మళ్లీ కిందకు పడిపోయే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుతం ట్రేడర్లకు ఈ స్టాక్‌ అనువుగా ఉంటుందని తెలిపారు. మధ్యస్థం నుంచి దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్‌ను అందించగలదని పేర్కొన్నారు. You may be interested

యస్‌ బ్యాంక్‌కు ఓపీ భట్ రాజీనామా షాక్‌

Friday 16th November 2018

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ షేర్లకు కష్టాలు ఇప్పట్లో తీరేలాలేవు. సీఈఐ సెర్చింగ్‌ కమిటీ సభ్యుడు ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్ రాజీనామాతో కంపెనీ షేర్లు శుక్రవారం మరో 8.59శాతం నష్టపోయాయి. గత ట్రేడింగ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా చేయడంతో బ్యాంకు షేర్లు 7.42శాతం నష్టం నష్టపోయిన సంగతి తెలిసిందే. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాల వ్యవహారంపై

10,520-10,690 రేంజ్‌లో నిఫ్టీ!!

Friday 16th November 2018

ద్రవ్యల్బోణం తగ్గుదల, మార్కెట్‌లో లిక్విడిటీ పెంచేందుకు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ కొనుగోలు చేయడం, క్రూడ్‌ ధరలు భారీగా పతనం కావడం వంటి అంశాల వల్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారిందని 5నాన్స్‌.కామ్‌ ఫౌండర్‌, సీఈవో దినేష్‌ రోహిరా తెలిపారు. ఈ వారాన్ని గమనిస్తే నిఫ్టీ ఇంట్రాడేలో 10,616 స్థాయిని బ్రేక్‌ఔట్‌ చేసిందని, 10,651 స్థాయిని తాకిందని, అయితే ఇండెక్స్‌ మళ్లీ ఆస్థాయిలో నిలదొక్కుకోలేకపోయిందని పేర్కొన్నారు. వారంలో 10,440

Most from this category