News


అవెన్యూ సూపర్‌మార్ట్‌ 11 శాతం డౌన్‌..!

Monday 14th January 2019
Markets_main1547458594.png-23578

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు డిసెంబర్ క్వార్టర్‌(క్యూ 3) ఫలితాలు అంతంత మాత్రంగా నమోదుకావడంతో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు సోమవారం 11 శాతం  పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు రూ.1454.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో క్యూ3 గణాంకాలు అంతంగా మాత్రంగా నమోదయ్యాయి. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలైన జెప్ఫారీస్‌, క్రిడెట్‌ శాష్యూ, ఎడెల్వీజ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌లు షేరు ఎర్నింగ్‌ టార్గెట్‌ అంచనాలను భారీ తగ్గాయి. ఈ రెండు కారణాలతో నేటి ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 11 శాతం క్షీణించి రూ.1,423.4 కనిష్ట స్థాయిని తాకింది. కంపెనీ మార్కెట్‌లో లిస్టైన దగ్గరి నుంచి ఒకేరోజులో ఇంత స్థాయిలో పడిపోవడం ఇదే గమనార్హం. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1568.95)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ.1406.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1062.90 రూ.1696.15లుగా నమోదయ్యాయి.



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ 16శాతం జూమ్‌..!

Monday 14th January 2019

రుణ పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తుందనే వార్తలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సోమవారం 17శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.253.5ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ‘గుదిబండగా మారిన రుణభారాన్ని తగ్గించుకునే పరిష్కార ప్రణాళికల్లో భాగంగా కంపెనీకి రుణదాతలతో ఈ వారంలో బోర్డు సమావేశం నిర్వహించనుందనే ఒక ప్రముఖ టీ.వీ ఛానెల్‌ వార్తల్ని ప్రసారం చేసింది. అలాగే ప్రస్తుత ప్రధాన ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ కంపెనీలో 10శాతం వాటాను

భారీ పతనాలుండవు!

Monday 14th January 2019

బిఎన్‌పీ పారిబా అంచనా దేశీయ మార్కెట్లో సమయానుగత దిద్దుబాట్లే తప్ప భారీ పతనాలు ఈ ఏడాది ఉండకపోవచ్చని బీఎన్‌పీ పారిబా ప్రతినిధి అభిజిత్‌ డే అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరాన్ని రెండు భాగాలుగా పరిశీలిస్తే ప్రథమార్ధంలో ట్రేడ్‌వార్‌, ఫెడ్‌ చర్యలు, ఎన్నికల ఫలితాల్లాంటి స్థూల ఆర్థికాంశాలు, ద్వితియార్ధంలో ఎర్నింగ్స్‌ రికవరీ లాంటి సూక్ష్మ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. ఎర్నింగ్స్‌ గ్రోత్‌తో పాటు సంస్కరణల ఫలాలు అందుకునేందుకు తగిన సంసిద్ధత, వినిమయ ఆధారిత ఎకనమిక్‌

Most from this category