STOCKS

News


అవంతీ ఫీడ్స్‌కు ఫలితాలకు షాక్‌..!

Tuesday 7th August 2018
Markets_main1533634686.png-19017

ముంబై:- అవంతీ ఫీడ్స్‌ షేర్లకు తొలి త్రైమాసిక ఫలితాలు షాకిచ్చాయి. జూన్‌ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు నమోదుకావడంతో ఆ కంపెనీ షేర్లు మంగళవారం 12శాతం నష్టపోయాయి. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లోఅవంతీ ఫీడ్స్‌ నికర లాభం 42 శాతం క్షీణించి‍ంది. ఈ గతేడాది ఇదే క్యూ1లో రూ.149 కోట్లను ఆర్జించగా, ఆ క్యూ1లో రూ. 90 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం రూ. 998 కోట్ల నుంచి రూ. 1040 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 40 శాతం పతనమై రూ.136.56 కోట్లకు దిగింది. పలితాలు ఇన్వెస్టర్లకు మెప్పించకపోవడంతో షేరు ఇంట్రాడేలో  12శాతం నష్టపోయి రూ.475.15ల వద్ద చేరుకుంది. మధ్యాహ్నం గం.2:50ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.540.3)తో పోలిస్తే 10 శాతం నష్టపోయి రూ.485.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 390.00 రూ.999.90లుగా నమోదయ్యాయి.



You may be interested

మూడు స్టాక్స్‌ నిఫ్టీని నిలబెట్టాయి...

Tuesday 7th August 2018

ప్రస్తుత ఏడాది ప్రథమార్ధంలోని మార్కెట్‌ పతనాలు నిజం కాదనే విషయాన్ని ప్రస్తుత ఎర్నింగ్స్‌ సీజన్‌ నిరూపించాయని టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోకప్రియ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిఫ్టీని గమనిస్తే.. ఇందులోని పెరుగుదలకు ప్రధానంగా మూడు స్టాక్సే కారణమని పేర్కొన్నారు. రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇందులో ఉన్నాయన్నారు. నిఫ్టీలోని చాలా కంపెనీలు 52 వారాల కనిష్ట స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నాయని

ఏఎంసీలపై బుల్లిష్‌

Tuesday 7th August 2018

ఐఐఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ నిర్మల్‌ జైన్‌ వచ్చే పదేళ్లలో దేశీయ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమ లక్ష కోట్ల డాలర్లను దాటేస్తుందని ఐఐఎఫ్‌ఎల్‌ వ్యవస్థాపకుడు నిర్మల్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా ఎంఎఫ్‌ పరిశ్రమ విలువ 30 ఏళ్ల క్రితం 20000 కోట్ల డాలర్లని, ఇప్పుడు దాని విలువ 16 లక్షల కోట్ల డాలర్లని చెప్పారు. దేశీయ ఎంఎఫ్‌ పరిశ్రమ ప్రస్తుత విలు 30వేల కోట్ల డాలర్లని, త్వరలో ఇది లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని

Most from this category