STOCKS

News


అవంతీ ఫీడ్స్‌ షేరు ధర 14% డౌన్‌

Monday 12th November 2018
Markets_main1542006274.png-21898

  • రూ.361 వద్దకు పతనం

ముంబై: అవంతీ ఫీడ్స్‌ షేరు ధర సోమవారం ఉదయం 14 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో రూ.361 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలను కంపెనీ శనివారం విడుదల చేయగా.. ఈ ఫలితాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఇవాళ షేరు ధర అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నికర లాభం రూ.46.40 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 60.11 శాతం క్షీణించింది. గతేడాది ఇదేకాలంలో రూ.116.34 కోట్లను కంపెనీ ఆర్జించిన విషయం తెలిసిందే. ఇక నికర ఆదాయం ఈ ఏడాది క్యూ2లో రూ.766 కోట్లు కాగా, గతేడాది ఈకాలంలో నమోదైన రూ.864 కోట్లతో పోల్చితే 11.41 శాతం తగ్గింది. అంతకుముందు ఏడాది క్యూ2లో రూ.674 కోట్లుగా ఉన్నటువంటి నికర వ్యయం ఈసారి రూ.692 కోట్లకు పెరిగింది. బీఎస్‌ఈలో ఉదయం 9 గంటల 36 నిమిషాలకు 1.16 లక్షల షేర్లు చేతులుమారగా.. ఈ షేరు రెండు వారాల సగటు 53,000 షేర్లుగా ఉంది. గతేడాది క్యూ2లో రూ.8.54 వద్ద ఉన్నటువంటి ఎర్నింగ్‌ పర్‌ షేర్‌.. తాజా క్వార్టర్‌లో రూ.3.41 వద్దకు పడిపోయింది. జూన్‌ త్రైమాసికంలో రూ.6.29 వద్ద ఉంది. రూ.1 ముఖవిలువ కలిగిన ఈ షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.354, రూ.980లుగా ఉన్నాయి.



You may be interested

ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి రోజేది?

Monday 12th November 2018

మనీ మార్కెట్లలో స్థిరత్వం వస్తోందని, సాధారణ స్థాయికి వస్తున్నాయని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు. మార్కెట్లలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందని, లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు బాగా పెరగొచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోందన్నారు. సెప్టెంబర్‌, ఆగస్ట్‌ నెలల కన్నా అక్టోబర్‌లో ఎక్కువ పెట్టుబడులు ఉండొచ్చని తెలిపారు. ఇందుకు ఇన్వెస్టర్ల

ఈ షేర్లను పడ్డప్పుడల్లా కొనండి..

Monday 12th November 2018

నిఫ్టీ ఇండెక్స్‌ తన బలమైన మద్దతు స్థాయి 10,000 మార్క్‌ నుంచి బౌన్స్‌బ్యాక్‌ అయ్యిందని ఎల్‌కేపీ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రోహిత్‌ సింగ్రే తెలిపారు. డైలీ చార్ట్స్‌లో పాజిటివ్‌ డైవర్జెన్స్‌ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రివర్సల్‌కు ఇది ఒక సంకేతమని తెలిపారు. ఇండెక్స్‌ తన 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌కు దిగువున ట్రేడ్‌ అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది బలమైన నిరోధ స్థాయి 10,600- 10,700 జోన్‌ దిగువున కదలాడుతోందని తెలిపారు.

Most from this category