STOCKS

News


సందడి చేస్తున్న అటో షేర్లు

Friday 12th October 2018
Markets_main1539330424.png-21087

  • 6శాతం లాభపడిన మహీంద్రా&మహీంద్రా

ముంబై:- మార్కెట్‌ ర్యాలీ భాగంగా శుక్రవారం అటో షేర్లు సందడి చేస్తున్నాయి. అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 4.50శాతం లాభపడింది. మహీంద్రా&మహీంద్రా, మారుతి కంపెనీ షేర్ల 6శాతం ర్యాలీ ఇండెక్స్‌ను ముందుండి నడిపించింది. మధ్యాహ్నం గం.12:25ని.లకు అటో ఇండెక్స్‌ గత ముగింపు (8739.50)తో పోలిస్తే 4.19శాతం లాభంతో 9,106.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 16షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా మహీంద్రా&మహీంద్రా, ఐషర్‌ మోటర్‌, అపోలో టైర్స్‌ షేరు 6శాతం ర్యాలీ చేయగా, మారుతి జజాజ్‌ అటో, భారత్‌ఫోర్జ్‌, మదర్‌సుమీ షేర్లు 5శాతం పెరిగాయి. అశోక్‌లేలాండ్‌, టీవీఎస్‌ మోటర్స్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. అమరరాజా బ్యాటరీస్‌, ఎక్సిడైడ్‌, ఎంఆర్‌ ఎఫ్‌ షేర్లు 2శాతం పెరిగాయి. అలాగే భాష్‌ లిమిటెడ్‌, హీరోమోటర్‌ కార్ప్‌, టాటామోటర్స్‌డీవీఆర్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయానికి ఎస్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో ఎంఅండ్‌ఎం, ఐషర్‌మోటర్స్‌, మారుతి షేర్లు మొదటి మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

సిమెంట్‌ రంగం.. క్యూ2 ఫలితాల ప్రివ్యూ..

Friday 12th October 2018

సిమెంట్‌ రంగ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లోనూ సందడి చేసే అవకాశాలు లేవని కోటక్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. వార్షికంగా విక్రయాల్లో 13 శాతం వృద్ధి నమోదైనప్పటికీ.. వ్యయాలు పెరుగుతుండటం, ధరల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవడం వల్ల ప్రస్తుత క్వార్టర్‌లోనూ కంపెనీలు చెప్పుకోదగ్గ పనితీరు కనబర్చకపోవచ్చని అంచనా వేసింది. ఏసీసీ, అంబుజా వంటి కంపెనీల ఈబీటా వార్షికంగా 11 శాతం పెరగొచ్చని పేర్కొంది.

ఐటీ ఎర్నింగ్స్‌.. ఎలా ఉండొచ్చు?

Friday 12th October 2018

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ, జూలై-సెప్టెంబర్‌) ఐటీ కంపెనీల ఎర్నింగ్స్‌ ఎలా ఉండొచ్చొ తెలియజేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ♦ ఐటీ కంపెనీల ఎర్నింగ్స్‌లో మంచి వృద్ధి నమోదు కావొచ్చు. రెవెన్యూ వృద్ధి వార్షికంగా 7.9 శాతం, త్రైమాసికంగా 2.1 శాతంగా ఉండొచ్చు. టైర్‌-1 ఐటీ వృద్ధి 1.9 శాతం (క్వార్టర్ పరంగా), 6.7 శాతం (వార్షికంగా).. మిడ్‌క్యాప్‌ ఐటీలో వృద్ధి 3.4

Most from this category