STOCKS

News


అదరగొడుతున్న ఆటో షేర్లు..!

Wednesday 4th April 2018
Markets_main1522833619.png-15179

ముంబై:- మార్చిలో వాహన విక్రయాలు మంచి గణాంకాలను సాధించడంతో బుధవారం ట్రేడింగ్‌లో అటో రంగ షేర్లు లాభాల ర్యాలీ చేస్తున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య ‘‘ట్రేడ్‌ వార్‌’’ తీవ్రమైన నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాలకు సూచీలు నష్టాల బాటలో నడుసున్నప్పటికీ, ఒక్క అటోరంగ సూచీ మాత్రమే లాభాల్లో  ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.2:30లకు షేరు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అటో సూచి 0.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ రంగానికి చెందిన టాటామోటర్స్‌, ఐషర్‌ మోటర్స్‌, హీరో మోటర్స్‌ కార్‌‍్ప షేర్లు నిఫ్టీలోని టాప్‌-5 గెయినర్లుగా ట్రేడ్‌ అవుతున్నాయి. టాటామోటర్స్‌, ఐషర్‌ మోటర్స్‌, భాష్‌ లిమిటెడ్స్‌, టాటామోటర్స్‌ డీవీఆర్‌, మదర్‌సుమీ సన్స్‌, హీరోమోటర్స్‌ కార్ప్‌ షేర్లు 5నుంచి1శాతం వరకు లాభపడ్డాయి.



You may be interested

అసలెందుకీ అనూహ్యపతనం?

Wednesday 4th April 2018

ఒక్కసారిగా నష్టాల్లోకి దేశీయ సూచీలు.. చైనా టారిఫ్‌లే కారణమంటున్న నిపుణులు దేశీయ సూచీలు బుధవారం ఆరంభ లాభాలను మధ్యాహ్నానానికి కోల్పోయి భారీ నష్టాల్లోకి దిగజారాయి. మంగళవారం ముగింపుతో పోలిస్తే సెన్సెక్స్‌ దాదాపు 370 పాయింట్లు, నిఫ్టీ సుమారు 125 పాయింట్లు, బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 387 పాయింట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సూచీల్లో ఇంత అనూహ్య పతనానికి దిగువ అంశాలు కారణమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 1. చైనా టారిఫ్‌లు:  తాజాగా మరో 106 యూఎస్‌

10500 వద్ద బలమైన నిరోధం!

Wednesday 4th April 2018

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ సూచీలు బుధవారం కూడా పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్‌ రంగంలో పాజిటివ్‌ వార్తలు ఈ వారం ఆరంభం నుంచి నిఫ్టీని నిలబెడుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ తన 20 రోజుల డీఎంఏ స్థాయి 10240 పాయింట్లు, 200 రోజుల డీఎంఏ స్థాయి 10186 పాయింట్లకు పైన ట్రేడవుతోంది. డైలీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది. వచ్చే సెషన్లలో నిఫ్టీ 10250 పాయింట్లను నిలబెట్టుకుంటే మరింత పైకి అప్‌మూవ్‌

Most from this category