STOCKS

News


అటో షేర్లకు అమ్మక గణాంకాల పోటు

Wednesday 2nd January 2019
Markets_main1546416256.png-23368

  • 7శాతం నష్టపోయిన ఐషర్‌ మోటర్స్‌

ఆటో షేర్లను డిసెంబర్‌ విక్రయ గణాంకాలు నష్టాల బాట పట్టించాయి. పరిశ్రమలో నగదు కొరత, స్థూల ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో డిసెంబరులో దేశీయ వాహన విక్రయాలు మందకొడిగా నమోదయ్యాయి. ఫలితంగా నేటి ఇంట్రాడే అటోరంగ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2.65శాతం నష్టపోయింది. అటో ఇండెక్స్‌ మధ్యాహ్నం గం.1:30ని.లకు గత ముగింపు(9182.45)తో పోలిస్తే 2.50శాతం నష్టపోయింది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 16 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఐషర్‌ మోటర్‌ 7శాతం నష్టపోయింది. ఎం అండ్‌ ఎండ్‌ 4శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 3.50శాతం, అశోక్‌ లేలాండ్‌ 3శాతం, టాటామోటర్స్‌ డీవీర్‌, టాటామోటర్స్‌, హీరోమోటోకార్ప్‌, మారుతి, ఎక్సైడ్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. అలాగే భారత్‌ ఫోర్జ్స్‌, బజాజ్‌ అటో, మదర్‌సన్‌ సుమి, అమర రాజా బ్యాటరీస్‌, అపోలోటైర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, భాష్‌ లిమిటెడ్‌ షేర్లు 1నుంచి అరశాతం నష్టపోయాయి. ఇదే సమయానికి నిఫ్టీ - 50 సూచీలోని టాప్‌ - లూజర్లలో ఐషర్‌ మోటర్స్‌ 7శాతం నష్టంతో అగ్రస్థానంలో, ఎం అండ్‌ ఎండ్‌ 4శాతం నష్టంతోనూ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.



You may be interested

సెన్సెక్స్‌ 400 పాయింట్ల డౌన్‌

Wednesday 2nd January 2019

10800 దిగువకు నిఫ్టీ ఇండెక్స్‌ మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటో, మెటల్‌ రంగ షేర్లలో అ‍మ్మకాలు సూచీలను నష్టాల బాట పట్టించాయి. అలాగే ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌తో పాటు యూరప్‌, అమెరికా మార్కెట్లకు చెందిన ఫ్యూచర్ల నెగిటివ్‌ ట్రేడింగ్‌ సైతం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి.  అలాగే మార్కెట్లో అధిక షేర్లు ఎక్కువగా వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతుండంతో పాటు ఇటీవల కొన్ని షేర్లు తమ

ఓఎంసీలకు కష్టకాలం?!

Wednesday 2nd January 2019

క్యు3లో నష్టాలకు అవకాశం క్రూడాయిల్‌ ధరలు పతనం, రిఫైనింగ్‌ మార్జిన్లు క్షీణించడంతో డిసెంబర్‌ త్రైమాసికంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీల(ఓఎంసీ) ఎర్నింగ్స్‌ దెబ్బతినవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ త్రైమాసికంలో సింగపూర్‌ గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎం) ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. డిసెంబర్‌లో జీఆర్‌ఎం బ్యారెల్‌కు 4.3 డాలర్లకు పతనమైంది. క్రూడాయిల్‌ ధరలు ఒక్క డిసెంబర్‌లోనే దాదాపు పది శాతం పతనమయ్యాయి. ఈ రెండిటి ప్రభావం ఓఎంసీల పద్దు పుస్తకాలను దెబ్బతీస్తుందని యాంటిక్‌ బ్రోకింగ్‌

Most from this category