STOCKS

News


నష్టాల బాటలో అటో షేర్లు

Thursday 6th December 2018
Markets_main1544082426.png-22698

  • 4.50శాతం నష్టపోయిన మారుతి సుజుకీ

నవంబర్‌ అమ్మకాలు అతంత మాత్రంగానే నమోదు కావడంతో గురువారం అటో షేర్ల నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. మధ్నాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(8,992.90)తో పోలిస్తే 1శాతం నష్టంతో 8,877.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం 16 షేర్లలో 12 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన మారుతి 4.48శాతం నష్టపోయింది. అలాగే షేరుకు సాంకేతికంగా కీలకమైన మద్దతు ధర రూ.7,299.4ల స్థాయిని కూడా బ్రేక్‌ చేయడం షేరు పతనానికి మరో కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ రోలాండ్‌ అమ్మకాలు నవంబర్‌లో స్వల్ప తగ్గుదలతో టాటా మోటర్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. టాటామోటర్స్‌, టాటామోటర్స్‌ డీవీఆర్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. అలాగే టీవీఎస్‌ మోటర్స్‌ సైతం 3శాతం నష్టపోయింది. ఐషర్‌ మోటర్స్‌, అమరరాజాబ్యాటరీస్‌, అపోలోటైర్స్‌, అశోక్‌లేలాండ్స్‌, భారతీఫోర్జ్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. హీరోమోటోకార్ప్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఎంఅండ్‌ఎం, ఎక్సైడ్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. బజాజ్‌-అటో, భాష్‌లిమిటెడ్‌, మదర్‌సుమీ షేర్లు 1శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

సానుకూలతలున్నా.. ప్రతికూలతలూ ఉన్నాయ్‌...

Thursday 6th December 2018

మార్కెట్‌ రేంజ్‌ బౌండ్‌లోనే ఉండొచ్చంటున్న ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ రేంజ్‌ బౌండ్‌లో కదలాడవచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేశ్‌ జోషి తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో మార్కెట్‌ మిశ్రమ పనితీరు కనబర్చిందని పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో చూస్తే.. వాణిజ్య ఉద్రిక్తతలను ప్రధాన అంశంగా చెప్పుకోవాలి. మూడు నెలల సంధి కాలంలో అమెరికా- చైనా దేశాలు ఒక ఒప్పందానికి

మార్కెట్‌ పతనానికి 5 కారణాలు

Thursday 6th December 2018

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఒక శాతానికి మించి నష్టాలను నమోదుచేశాయి. నిఫ్టీ 10,700 పాయింట్ల మార్కును కోల్పోయి 10,641 పాయింట్ల ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదుచేసింది. సెన్సెక్స్‌ 350 పాయింట్ల మేర నష్టపోయి 35,534 వద్దకు చేరుకుంది. ఇంతటి పతనానికి ఐదు ప్రధాన కారణాలను దలాల్‌ స్ట్రీట్‌ పండితులు వెల్లడించారు. అవేంటంటే.. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ

Most from this category