STOCKS

News


అటోమొబైల్‌ షేర్ల ర్యాలీ

Friday 9th November 2018
Markets_main1541754536.png-21824

మార్కెట్‌ లాభనష్టాల ట్రేడింగ్‌లో భాగంగా శుక్రవారం మిడ్‌సెషన్‌ అనంతరం అటో రంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో అటోరంగ షేర్ల ఉత్సాహానిచ్చాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్‌ నేటి ట్రేడింగ్‌లో 1.50శాతం లాభడింది. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(9,219.50)తో పోలిస్తే 1శాతం లాభంతో 9,350 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలోని మొత్తం 16 షేర్లకు గానూ, 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, మిగిలిన మరో 5 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా హీరోమోటర్స్‌ 3శాతం లాభపడింది. మారుతి 2.50శాతం, అపోలో టైర్స్‌ 2శాతం, భాష్‌, టాటా మోటర్స్‌, ఎంఆర్ఎఫ్‌ 1శాతం పెరిగాయి. బజాజ్‌ అటో, ఎంఅండ్‌ఎం, ఎక్సైడ్‌, టాటామోటర్స్‌ డీవీఆర్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు అశోక్‌ లేలాండ్‌ 3శాతం, భారత్‌ఫోర్జ్‌ 2.50శాతం, ఐషర్‌మోటర్స్‌ 1శాతం, మదర్‌ సుమీ, అమరరాజాబ్యాటరీస్‌ అరశాతం నష్టపోయాయి.



You may be interested

ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 9th November 2018

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడంతో శుక్రవారం మిడ్‌సెషన్‌ అనంతరం ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు భారీ ర్యాలీని చేస్తున్నాయి. ప్రపంచమార్కెట్లో బ్యారెల్‌ చమురు ధర  70.65 డాలర్ల కనిష్టానికి పతనమయ్యాయి. చమురు ధర పతనంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు మార్జిన్లు పెరుగుతాయని అంచనాలతో ఇన్వెస్టర్లు ఓఎంసీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. పలితంగా ఆయిల్‌ కంపెనీ మార్కెట్‌ షేర్లు ర్యాలీ చేశాయి.  అత్యధికంగా హెచ్‌పీసీఎల్‌ 5శాతం లాభపడింది. ఇండియన్‌ ఆయిల్‌ 3శాతం,

పరిస్థితులు మారుతున్నాయ్‌.. కొనడానికి రెడీనా?

Friday 9th November 2018

క్రూడ్‌ ధరలు దిగిరావడం, లిక్విడిటీ సమస్యలు తగ్గడం వంటి సానుకూలతల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలుకు అవకాశాలున్నాయని ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌) నిశ్చల్‌ మహేశ్వరి తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో కొనుగోలుదారుడిగానే ఉంటాను. కేవలం ముడిచమురు ధరలు మాత్రమే కాదు.. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. డాలర్‌ కూడా బలహీనపడుతోంది. ఇది మరొక

Most from this category