STOCKS

News


నష్టాల బాటలో అటో షేర్లు

Thursday 24th January 2019
Markets_main1548322828.png-23785

మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌లో భాగంగా అటో షేర్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1శాతనికి పైగా నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా అశోక్‌లేలాండ్‌ 4.50శాతం షేరు నష్టపోయింది. అలాగే టాటామోటర్స్‌ డీవీఆర్‌, టాటామోటర్స్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. ఎక్సైడ్‌ లిమిటెడ్‌, మదర్‌సుమి లిమిటెడ్‌, భారత్‌ ఫోర్జ్‌ షేర్లు 2శాతం, టీవీఎస్‌ మోటర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, బజాజ్‌ అటో, అమరరాజాబ్యాటరీస్‌, అపోలో టైర్స్‌ షేర్లు 1శాతం పతనయ్యాయి. భాష్‌ లిమిటెడ్‌, ఎంఅండ్‌ఎం, మారుతి, హీరోమోటోకార్ప్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. అయితే ఐషర్‌మోటర్స్‌ షేరు మాత్రం అరశాతం లాభపడింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు (8535)తో పోలిస్తే 1శాతం నష్టంతో 8,526.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ఇదే సమయానికి టాటామోటర్స్‌ షేరు 3శాతం నష్టంతో నిఫ్టీ-50 సూచీలో టాప్‌- లూజర్లలో రెండోస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

యస్‌బ్యాంక్‌ సీఈఓగా రవ్‌నీత్‌ గిల్‌..షేరు 9 శాతం జంప్‌

Thursday 24th January 2019

ప్రస్తుతం డాయిష్‌బ్యాంక్‌ ఇండియా సీఈఓగా పనిచేస్తున్న రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ను తమ ఎండీ, సీఈఓగా ఎంచుకున్నట్లు యస్‌బ్యాంక్‌ వెల్లడించింది. వచ్చే మార్చి1న ఆయన యస్‌బ్యాంక్‌ పగ్గాలు చేపడతారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. డాయిష్‌బ్యాంక్‌ సీఈఓగా ఆయన ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 10న ఇద్దరి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసిన బ్యాంకు, ఆ పేర్లను ఆర్‌బీఐకి పంపింది. ఫిబ్రవరి 1లోగా కొత్త సీఈఓను యస్‌బ్యాంకు

ఈ స్టాకులపై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Thursday 24th January 2019

ఏసియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మైండ్‌ట్రీ, ఐటీసీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ బ్రోకింగ్‌ సంస్థ ప్రతినిధి సంజీవ్‌ బాసిన్‌ చెప్పారు. ఏసియన్‌ పెయింట్స్‌ డెకరేటివ్‌ పెయింటింగ్‌ వ్యాపారంలో మెజార్టీ వాటా పెంచుకుంటూపోతోందన్నారు. రూ. 1150 నుంచి ఈ షేరుపై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఇటీవల పెంచిన ఉత్పత్తుల ధర ‍ప్రభావం వచ్చే మూడునెలల్లో ఫలితాల్లో కనిపిస్తుందన్నారు. మైండ్‌ట్రీపై రూ.800 స్థాయి నుంచి బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఈ కంపెనీలో వాటాలను

Most from this category