STOCKS

News


ఆటో ఇండెక్స్‌ డౌన్‌

Monday 24th December 2018
Markets_main1545647944.png-23205

హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ అటో షేర్ల పతనంతో సోమవారం అటో షేర్లు నష్టాలతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేడు 1.50శాతం నష్టపోయి 9,206.75 వద్ద ముగిసింది.  నేడు ఎన్‌ఎస్‌ఈలోని టాప్‌ -5 లూజర్లలో హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ అటో షేర్లు చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇండెక్స్‌లోని మొత్తం 11 షేర్లలో 8 షేర్లు నష్టాలతో ముగియగా, 3 షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా హీరోమోటోకార్ప్‌ షేర్లు 5శాతం నష్టపోయింది. మదర్సన్‌ సుమి 4శాతం, టీవీఎస్‌ మోటర్‌, బజాజ్‌ అటో, ఎక్సైడ్‌, భాష్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. టాటామోటర్స్‌ డీవీఆర్‌, టాటామోటర్స్‌, అపోలో టైర్స్‌, ఐషర్‌మోటర్స్‌ షేర్లు 2శాతం పతనమవ్వగా, ఎంఆర్‌ఎఫ్‌, అశోక్‌లేలాండ్‌ మారుతి షేర్లు 1శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు ఎం అండ్‌ ఎం, భారతీ ఫోర్జ్‌, అమరరాజా బ్యాటరీస్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి.



You may be interested

2018లో శభాష్‌ అనిపించిన ఫండ్స్‌ ఇవే

Monday 24th December 2018

ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు అంత ఆశాజనకంగా లేదనే చెప్పుకోవాలి. స్థానిక, అంతర్జాతీయ అంశాలతో మార్కెట్లు అస్థిరతల మధ్యే చలించాయి. అందుకే ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో చక్కని పనితీరు చూపించిన పథకం ఇచ్చిన రాబడులు కేవలం 5.8 శాతంగానే ఉన్నాయి. ఓ బాండ్‌లో వచ్చే రాబడి కంటే ఇది తక్కువ. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం, చమురు ధరల పెరుగుదల, ఇరాన్‌పై

10700 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 24th December 2018

270 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ప్రపంచమార్కెట్ల నెలకొన్న అనిశ్చితి వాతావరణంతో దేశీయ మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతోనే ముగిసింది. మెటల్‌, అటో మొబైల్‌ షేర్ల పతనంతో సోమవారం సెన్సెక్స్‌ 271 పాయిం‍ట్లు నష్టపోయి 35470 వద్ద, నిఫ్టీ సూచీ 90.50 పాయింట్లను కోల్పోయి 10663 వద్ద ముగిసాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 154 పాయింట్ల నష్టపోయి 26,706.00 వద్ద ముగిసింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల ర్యాలీతో ఒక్క ఐటీ ఇండెక్స్‌(అరశాతం

Most from this category