STOCKS

News


నష్టాల బాటలో అటో షేర్లు

Monday 13th May 2019
Markets_main1557739383.png-25709

మార్కెట్‌ పతనంలో భాగంగా అటోరంగ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎన్‌ఈసీలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1శాతం క్షీణించింది. గత సంవత్సరపు చివరి త్రైమాసికంలో పలు వాహన కంపెనీల ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో ఏప్రిల్‌లో వాహన విక్రయాలు క్షీణించనట్లు సియామ్‌, ఎఫ్‌ఏడీఏ సంస్థలు గణాంకాలను విడుదల చేయడంతో నేడు వాహన కంపెనీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. క్యూ4 ఫలితాలు బాగలేక పోవడంతో ఐషర్‌ మోటర్స్‌ షేరు అత్యధికంగా 6.50శాతం నష్టపోయింది. మదర్‌సుమీ షేరు 3శాతం, అశోక్‌లేలాండ్‌ 2.50శాతం, అపోలోఏపిల్‌టైర్స్‌, టీవీఎస్‌ మోటర్స్‌, టాటామోటర్స్‌ 2శాతం నష్టపోయాయి. ఎంఆర్‌ఎఫ్‌, ఎంఅండ్‌ఎం, అమరరాజాబ్యాటరీస్ షేర్లు 1శాతం పతనమయ్యాయి. అలాగే మారుతి, ఎక్సైడ్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు హీరోమోటోకార్ప్‌, బజాజ్‌-అటో షేర్లు 1శాతం, భాష్‌ కంపెనీ షేర్లు అరశాతం లాభడ్డాయి. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు (8,093.20)తో పోలిస్తే 1.19శాతం నష్టపోయి 1.19శాతం నష్టపోయి 7,996.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

స్వల్పకాలానికి సిఫార్సులు

Monday 13th May 2019

వచ్చే రెండు మూడు వారాల సమయానికి మంచి రాబడినిచ్చే స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. ఎపిక్‌ రిసెర్చ్‌ సిఫార్సులు 1. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1430. స్టాప్‌లాస్‌ రూ. 1360. స్టాకు అప్‌ట్రెండ్‌లో ఉంది. హయ్యర్‌హై, లో ఏర్పరుస్తూ సాగుతోంది. తాజాగా వచ్చిన స్వల్పకాలిక పతనంలో 20 రోజుల డీఎంఏ వద్ద మద్దతు తీసుకుంది. ఈ స్థాయిల నుంచి త్వరలో అప్‌మూవ్‌ కొనసాగించనుంది. 2. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు.

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.50శాతం డౌన్‌

Monday 13th May 2019

స్వల్ప నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 3.50 శాతం నష్టపోయింది. ఇప్పటివరకు క్యూ4 ఫలితాలను ప్రకటించిన పలు ప్రభుత్వరంగ బ్యాంకుల ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ రంగ షేర్లలో అమ్మకాలు మొదలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలహాదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా 7శాతం నష్టపోయింది. యూనియన్‌ బ్యాంక్‌, కెనరా

Most from this category