STOCKS

News


నష్టాల్లో అటో షేర్లు

Tuesday 22nd January 2019
Markets_main1548144264.png-23729

నష్టాల మార్కెట్లో అటో షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని అటో ఇండెక్స్‌ 1.50శాతం పతనమైంది. ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌షేర్లైన మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి షేర్ల క్షీణత ఇండెక్స్‌ పతనానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.1:00లకు అటో ఇండెక్స్‌ 1.30శాతం నష్టపోయి 8,628.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి అశోక్‌ లేలాండ్‌ అత్యధికంగా 3.50శాతం నష్టపోయింది. ఎం అండ్‌ ఎం 3శాతం, టాటామోటర్స్‌ డీవీఆర్, మారుతి, టాటామోటర్స్‌, మదర్‌సమి షేర్లు 2శాతం క్షీణించాయి. అలాగే ఎంఆర్‌ఎఫ్‌, హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ అటో, ఐషర్‌మోటర్స్‌, భారత్‌ఫోర్జ్‌ షేర్లు అరశాతం పతనమయ్యాయి. మరోవైపు టీవీఎస్‌మోటర్‌ షేరు 3శాతం లాభపడింది. భాష్‌ లిమిటెడ్‌ 1శాతం, అపోలో టైర్స్, ఎక్సైడ్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. ఇదే సమానికి ఎంఅండ్‌ఎం షేరు 3శాతం నష్టంతో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ - 50 టాప్‌ - 5 లూజర్లలో రెండోస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఈ షేర్లన్నీ బేరిష్‌

Tuesday 22nd January 2019

ఎంఏసీడీ నెగిటివ్‌ క్రాసోవర్‌ ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.

సాంక్టమ్‌ వెల్త్‌ స్వల్పకాల సిఫార్సులు

Tuesday 22nd January 2019

రాబోయే నెల రోజుల్లో దాదాపు 15 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. యునైటెడ్‌ బ్రూవరీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1700. స్టాప్‌లాస్‌ రూ. 1410. గత సెప్టెంబర్‌లో గరిష్ఠాలను తాకి తిరిగి అక్టోబర్‌ నాటికి రూ. 1100 స్థాయికి పతనమైంది. అప్పటినుంచి తిరిగి క్రమానుగత రికవరీ చూపుతోంది. సోమవారం తాజా బ్రేకవుట్‌ సాధించింది జీవితకాల గరిష్ఠాన్ని చేరింది. బోలింగర్‌ బ్యాండ్‌ సహా ఇండికేటర్లు

Most from this category