STOCKS

News


జోరుగా అటో షేర్ల ర్యాలీ

Thursday 29th November 2018
Markets_main1543482499.png-22487

  • 4శాతం లాభపడిన బజాజ్‌ అటో, మహీంద్రా  షేర్లు

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా గురువారం అటో రంగ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ అటోరంగ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతం ర్యాలీ చేసింది. బజాజ్‌ అటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేరు 4శాతం ర్యాలీ చేశాయి. టీవీఎస్‌ మోటర్‌ 2.50శాతం, టాటామోటర్స్‌, అశోక్‌లేలాండ్‌, భాష్‌ లిమిటెడ్‌, అపోలోటైర్స్‌, భారత్‌ఫోర్జ్స్‌, హీరోమోటర్స్‌ కార్ప్‌, షేర్లు 1.50శాతం పెరిగాయి. అలాగే ఐషర్‌మోటర్స్‌, మారుతి, టాటామోటర్స్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే సూచీలోని అమరరాజా బ్యాటరీస్ మదర్‌సుమీ షేర్లు 1.50శాతం వరకు నష్టపోయాయి. అలాగే ఎక్సైడ్‌, ఎంఆర్‌ఎఫ్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 1.50శాతం లాభంతో 9,218.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ అటో షేర్లు రెండు, మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

 You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం అప్‌..!

Thursday 29th November 2018

బ్యాంకు షేర్లలో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌ కారణంగా నిఫ్టీబ్యాంక్‌ ఇండెక్స్‌ సూచీ గురువారం ట్రేడింగ్‌లో 1.50శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 26,641 వద్ద ప్రారంభమైంది. సాదారణంగా ఎఫ్‌&ఓ ట్రేడింగ్‌ చివరి రోజు ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అయితే నేటి ట్రేడింగ్‌లో షార్ట్‌ కవరింగ్‌ కారణంగా బ్యాంకింగ్‌ షేర్లు స్థిరమైన ర్యాలీని చేస్తుండటం విశేషం. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంపుపై

కొనదగిన 3 స్టాక్స్‌..

Thursday 29th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. సిప్లా ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. బై రేటింగ్‌ కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.680గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2 ఫలితాలు తమ అంచనాల కన్నా దిగువునే ఉన్నాయి. వార్షికంగా చూస్తే సిప్లా నికర లాభం 16 శాతం, రెవెన్యూ 2 శాతం క్షీణించింది. మార్జిన్లు కూడా 17.5 శాతానికి తగ్గాయి. హై-బేస్‌ కారణంగా దేశీ వ్యాపారం

Most from this category