STOCKS

News


నాలుగు ఐపీఓలకు సెబీ ఆమోదం

Tuesday 9th October 2018
Markets_main1539059527.png-20957

న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ తాజాగా నాలుగు కంపెనీల ఐపీఓలకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఆమోదం తెలిపింది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పురానిక్‌ బిల్డర్స్‌, ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ నిహిలంత్‌, ముత్తూట్‌ గ్రూప్‌కు చెందిన సూక్ష్మ రుణ సంస్థ ముత్తూట్‌ మైక్రోఫిన్‌ కంపెనీల ఐపీఓలకు సెబీ పచ్చజెండా ఊపింది.

ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఐపీఓ సైజు రూ.2,000 కోట్లు 
ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.600 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, ఏఐ గ్లోబల్‌ 1.35 కోట్ల షేర్లను,  ప్రమోటర్ సమీర్‌ కోటేచ 44 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన 43.95 లక్షల షేర్లను జారీ చేసి రూ.300 కోట్లు సమీకరించాలని కూడా ఈ కంపెనీ యోచిస్తోంది. మొత్తం మీద ఈ కంపెనీ ఐపీఓ రూ.2,000 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. 

పురానిక్‌ బిల్డర్స్‌ ఐపీఓ @ రూ.1,000 కోట్లు 
ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.810 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా 18.60 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా  ఈ కంపెనీ రూ.1,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ ఆలోచన. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ వ్యవహరిస్తాయి.

ముత్తూట్‌ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ 
ముత్తూట్‌ పాపాచన్‌ గ్రూప్‌నకు చెందిన ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటికి అదనంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా మరో 1.63 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. మొత్తం మీద ఈ కంపెనీ ఐపీఓ రూ.800-1,000 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సూక్ష్మ రుణాలివ్వడంపైననే ఈ కంపెనీ దృష్టి సారిస్తోంది. 

నిహిలంత్‌ ఐపీఓ 
పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఐటీ ఈ కంపెనీ రూ.250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ప్రమోటర్‌ గ్రూప్‌ వాస్తు ఐటీ  21.25 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నది.

కంపెనీ        ఐపీఓ సైజు (రూ.కోట్లు)
ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్‌    2,000
పురానిక్‌ బిల్డర్స్‌        1,000
ముత్తూట్‌ మైక్రోఫిన్‌        800-1,000
నిహిలంత్‌             --



You may be interested

నేడు పీఎస్‌యూ బ్యాంక్‌ ఉద్యోగుల నిరసన

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకగా బ్యాంకు ఉద్యోగుల యూనియన్‌ ఒక రోజు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంకులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు (అక్టోబరు 9న) దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, రాష్ట్ర రాజధానులలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రెటరీ వెంకటాచలం వెల్లడించారు. గత నెల 29న

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా చేతికి జీఏఎల్‌ పగ్గాలు

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా సొంతం చేసుకుంది. జీఏఎల్‌లో పెట్టుబడులకు సంబంధించి ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లతో వివాదాన్ని ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించుకున్నట్లు జీఎంఆర్‌ ప్రకటించింది. ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా పీఈ ఇన్వెస్టర్లకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో (జీఏఎల్‌) 5.86 శాతం ఈక్విటీ, 3,560 కోట్ల రూపాయల నగదును చెల్లించనున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ మెక్వయిరీ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఓల్డ్‌లేన్‌ తదితర పీఈ ఇన్వెస్టర్లు

Most from this category