ఐపీఓ పత్రాలు సమర్పించిన ఏఎస్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్
By Sakshi

న్యూఢిల్లీ: అసెట్, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఏఎస్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,000 కోట్ల మేర నిధులు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.600 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పీఈ సంస్థ, ఏఐ గ్లోబల్ 1.35 కోట్ల షేర్లను, ప్రమోటర్ సమీర్ కోటేచ 44 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా జేఎమ్ ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తాయి. మరో కంపెనీ కూడా ఐపీఓ పత్రాలను సెబీకి సమర్పించింది. ఫెర్రో అలాయ్స్ ఉత్పత్తి చేసే కోల్‌కతాకు చెందిన శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ కంపెనీ రూ.909 కోట్ల సమీకరణ నిమిత్తం ఐపీఓకు వస్తోంది. ఈ నిధులను రుణభారం తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, జేఎమ్ ఫైనాన్షియల్‌లు వ్యవహరిస్తాయి.
You may be interested
కొత్త వాహనాలపై టాటా మోటార్స్ దృష్టి
Wednesday 8th August 2018సనంద్: టాటా మోటార్స్ దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో 10-12 ప్రయాణికుల వాహనాలను తీసుకురావాలని భావిస్తోంది. కొత్త ఉత్పత్తులను ఆల్ఫా, ఒమెగా అనే రెండు ప్లాట్‌ఫామ్‌లపై అభివృద్ధి చేయనున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. ఈ ఉత్పత్తులతో ప్రయాణికుల వాహనాల విభాగంలో కంపెనీ స్థానం పటిష్టమవుతుందని ఆశిస్తున్నట్టు
ఎస్కార్ట్స్ చైర్మన్‌గా నిఖిల్ నందా
Wednesday 8th August 2018న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా నిఖిల్ నందా నియమితులయ్యారు. ఈయన ఎన్నికను కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించింది. ఎస్కార్ట్స్ చైర్మన్ రాజన్ నందా కన్నుమూయడంతో ఆయన కుమారుడు నిఖిల్ నందా గ్రూప్ బాధ్యతలను చేపట్టారు. ఈ విషయాన్ని కంపెనీ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది.