STOCKS

News


ఆసియా మార్కెట్లు పతనం..

Saturday 10th November 2018
Markets_main1541824859.png-21835

అమెరికా మార్కెట్ల నష్టాల నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచుతామని సంకేతాలివ్వడం వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లు పతనమయ్యాయి. ఆసియా ప్రధాన మార్కెట్లను గమనిస్తే.. తైవాన్‌, చైనా షాంఘై, జపాన్‌ నికాయ్‌ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పడిపోయాయి. ఇక హాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ ఏకంగా 2 శాతానికిపైగా పతనమైంది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 15 పాయింట్ల నష్టంతో 3,077 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 115 పాయిం‍ట్ల నష్టంతో 9,830 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 37 పాయింట్ల నష్టంతో 2,598 పాయింట్లకు క్షీణించింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల నష్టంతో 2,086 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 626 పాయింట్ల నష్టంతో 25,601 పాయింట్ల వద్ద ముగిసింది. జపాన్‌ నికాయ్‌ 225 కూడా ఏకంగా 236 పాయింట్ల నష్టంతో 22,250 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.



You may be interested

అమెరికా మార్కెట్ల ఎన్నికల ర్యాలీ సమాప్తం..

Saturday 10th November 2018

ప్రధాన ఇండెక్స్‌లు దాదాపు 1 శాతం డౌన్‌ అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు దాదాపు 1 శాతంమేర క్షీణించాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.77 శాతం లేదా 202 పాయిం‍ట్ల నష్టంతో 25,989 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఒకానొక సమయంలో 300 పాయింట్లకుపైగా పడిపోయింది. చివరకు కొంత కోలుకుంది. క్యాటర్‌పిల్లర్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.92 శాతం లేదా 26

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌ డౌన్‌..

Saturday 10th November 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ స్టాక్స్‌ ఏడీఆర్‌లు క్షీణించాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో, వేదాంత స్టాక్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోతే, వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది.   టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.46 శాతం లాభంతో 13.11

Most from this category