STOCKS

News


మిశ్రమంగా ముగిసిన ఆసియా మార్కెట్లు

Wednesday 7th November 2018
Markets_main1541589400.png-21774

మార్కెట్‌ వర్గాలు ఊహించినట్లుగానే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రటిక్‌ పార్టీ విజయం సాధించడంతో బుధవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆసియాలో జపాన్‌ మార్కెట్‌ ప్రధాన సూచీ నికాయ్‌ 225(0.28శాతం), చైనాకు చెందిన షాంఘై సూచీ(0.68శాతం),  దక్షిణ కొరియాకు దేశపు కోప్సీ సూచీ(0.53)లు నష్టపోయాయి. మిగిలిన అన్ని దేశపు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా తైవాన్‌ మార్కెట్‌ 1శాతం ర్యాలీ చేసింది. దానితో పాటు సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్స్ టైమ్స్, హాంగ్‌సెంగ్‌ సూచీలు అరశాతం లాభాల్లో ముగిశాయి. ఎస్‌జీఎస్టీ నిఫ్టీ 15.00 పాయింట్ల నష్టంతో​10,600.50 వద్ద ముగిసింది.



You may be interested

భారీ లాభాలతో ప్రారంభమైన యూరప్‌ మార్కెట్లు

Wednesday 7th November 2018

యూరప్‌ మార్కెట్ల ప్రారంభ సమయానికి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రటిక్‌ పార్టీ సంపూర్ణ విజయం ఖరారు కావడం యూరప్‌ మార్కెట్లకు ఉత్సాహానిచ్చింది. బ్రిటన్‌ చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ100 సూచీ 1శాతం లాభంతో 7,113 పాయింట్ల వద్ద, జర్మనీ డాక్స్‌ 1శాతం పెరిగి 11,598 వద్ద, ఫ్రాన్స్‌కు చెందిన సీఎసీ40 సూచీ 1.1శాతం ర్యాలీ 5,131 వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి. ‘‘మార్కెట్‌ వర్గాలు ఊహించిన విధంగానే అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అక్టోబర్‌లో

పసిడికి అమెరికా ఎన్నికల ఫలితాలు జోష్‌

Wednesday 7th November 2018

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు పసిడి ధరకి ఉత్సాహానిస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం భారత వర్తమానకాలం ప్రకారం మధ్యాహ్నం గం.2.20లకు ఔన్స్‌ పసిడి 8.10డాలర్లు పెరిగి 1,234.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పాలకపక్షమైన రిపబ్లిక్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిని అవలంభిస్తున్నారు. ఫలితాలు ప్రతిపక్షపార్టికి అనుకూలంగా వస్తుడంతో మార్కెట్లో అనిశ్చితి వాతవరణ పరిస్థితలు నెలకొనవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల

Most from this category