నష్టాల్లో ఆసియా మార్కెట్లు..
By Sakshi

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే జపాన్ మార్కెట్‌కు సెలవు. గురువారం జపాన్ నికాయ్ 225.. 139 పాయింట్ల లాభంతో 21,646 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక తైవాన్ సూచీ తైవాన్ ఇండెక్స్ 32 పాయింట్ల నష్టంతో 9,682 పాయింట్ల వద్ద, సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ కేవలం 1 పాయింటు నష్టంతో 3,039 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్ షాంఘై కంపొసిట్ 43 పాయింట్ల నష్టంతో 2,602 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 12 పాయింట్ల నష్టంతో 2,058 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ 102 పాయింట్ల నష్టంతో 25,916 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
ఇక అమెరికా మార్కెట్లకు గురువారం సెలవు. బుధవారం రోజు అక్కడి మార్కెట్ల వరుస రెండు రోజుల పతనానికి అడ్డు కట్ట పడింది. నాస్డాక్, ఎస్అండ్పీ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిస్తే, డౌజోన్స్ ఫ్లాట్‌గా క్లోజయ్యింది. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ ఫ్లాట్‌గా 24,465 పాయింట్ల వద్దే ముగిసింది. ఎస్అండ్పీ 500.. 0.3 శాతం లేదా 8 పాయింట్ల లాభంతో 2,649 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్డాక్ కంపొసిట్ 0.92 శాతం లేదా 63 పాయింట్ల లాభంతో 6,972 పాయింట్ల వద్ద ముగిసింది.
You may be interested
7 రోజుల రికార్డు పరుగు!
Friday 23rd November 2018ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్ట రీతిన బలపడుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో గురువారం ఒకేరోజు 77 పైసలు లాభపడి 70.69 వద్ద ముగిసింది. రూపాయి రికవరీ బాటన పయనించడం వరుసగా ఇది ఏడవరోజు. ఈ కాలంలో భారీగా 220 పైసలు లాభపడింది. బ్యాంకర్లు, ఎగుమతిదారులు డాలర్లను భారీగా విక్రయించడం కొనసాగిస్తున్నారు. గురువారం రూపాయి ప్రారంభంతోటే 71.12 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.68 వద్దకూ
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ అప్
Friday 23rd November 2018ఎస్‌జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 9:20 సమయంలో 23 పాయింట్ల లాభంతో 10,549 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ గురువారం ముగింపు స్థాయి 10,524 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లోనే ముగిశాయి.